ఇదో షార్ప్ నర్‌ ప్రపంచం...!



హాయ్‌ నేస్తాలూ..! ఏంటి ఇక్కడున్న చిన్నిచిన్ని బొమ్మలను చూసి భలే ఉన్నాయి.. అవి మా దగ్గర ఉంటే ఎంచక్కా ఆడుకునేవాళ్లం.. అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే! ఎందుకంటే అవి ఓ పని చేసే బొమ్మలన్నమాట. వాటితో ఏం పని చేస్తాం... అని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే ఈ కథనం చదివేయండి. మీకే అర్ధమవుతుంది...! ఇక్కడున్నవన్నీ బొమ్మల ఆకారంలో ఉన్న 'పెన్సిల్‌ షార్ప్‌నర్లు. మనం అటుఇటుగా... ఓ పది రకాల షార్ప్‌నర్లని చూసుంటాం. కానీ, అమెరికాలోని లోగాన్‌ ప్రాంతానికి చెందిన పౌల్‌ ఎ జాన్సన్‌ అనే వ్యక్తి మాత్రం ఏకంగా పెన్సిల్‌ షార్చ్‌నర్‌ మ్యూజియాన్నే ఏర్పాటు చేశారు. ఆయన ఇతర దేశాలకు వెళ్లినప్పుడు... అక్కడి నుంచి వింతైన షార్ప్‌నర్లని తెచ్చి మ్యూజియంలో పెట్టేవారట. అలా 20 ఏళ్లలో దాదాపుగా 8419 రకాల షార్ప్‌నర్లను అందులో ఉంచారట.

'చాలా వరకు అమెరికాలోనే!

ఈ మ్యూజియంలో ఉన్న షార్బ్‌నర్లన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంటాయట. అవి రకరకాల జంతువులు, పక్షులు, బార్బీడాల్‌, ఇల్లు బొమ్మల ఆకారాల్లో చాలా అందంగా ఉంటాయి. ఇవే కాకుండా పిజ్జా, బర్లర్‌, బ్రెడ్‌, కూల్‌డ్రింక్స్‌, పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్స్‌, ఐస్‌క్రీం ఆకారాల్లోనూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే... ఈ షార్ప్‌నర్లలో చాలా వరకు అమెరికాలో సేకరించినవే ఉన్నాయట. ఇది ప్రపంచంలోనే మొదటి షార్ప్‌నర్‌ మ్యూజియం తెలుసా..!

డబ్బు అవసరం లేదు!

పౌల్‌ చనిపోయిన తర్వాత... ఆయన కుటుంబ సభ్యులే మ్యూజియం నిర్వహణను చూసుకుంటున్నారట. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మ్యూజియం తెరిచే ఉంటుందట. ఆదివారాలు అయితే ఇంకా ఎక్కువసేపే ఉంటుంది. హాకింగ్‌ హిల్స్‌కు ఈ మ్యూజియం కూడా దగ్గరగా ఉండటంతో, చాలామంది పర్యాటకులు ఇక్కడికి కూడా వస్తుంటారట. మరో విషయం ఏంటంటే... ఇందులోకి వెళ్లడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదట నేస్తాలూ..! ఈ “పెన్సిల్‌ షార్ప్‌నర్‌ మ్యూజియం' విశేషాలు భలే ఉన్నాయి కదూ...

Responsive Footer with Logo and Social Media