చిన్న పిల్లల పద్యాలు
భారతమాతకు జేజేలు
బంగరు తల్లికి జేజేలు
పరమ పావనికి జేజేలు
పావనచరితకు జేజేలు.
చందమామ రావె, జాబిల్లి రావె
కొండెక్కి రావె, గోగుపూలు తేవే
బండెక్కి రావే, బంతి పూలు తేవే
పల్లకిలో రావె, పారిజాతం తేవే
తేఱెక్కి రావే, తేనెపట్టు తేవే
ఆటలాడ రావె, అబ్బయి(అమ్మాయి)కిచ్చి పోవె..
చుక్ చుక్ రైలు
చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగి నాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయ్ తినిపిస్తా
చల్లని పాలు తాగిస్తా
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా
రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా?
వన్నెల వన్నెల్ పూల మీద వాలుచున్నారా?
కన్నుల కన్నుల పండుగ చేస్తూ కదులుతున్నారా?
వనమంతా-దినమంతా వసంత శోభలతో
అందాల- ఆనందాల ఆటలాడేరా
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా.
వేకువమ్మ లేచింది.
తూరుపు వాకిలి తెరిచింది.
గడపకు కుంకం పూసింది
బంగరు బిందె తెచ్చింది.
ముంగిట వెలుగులు చల్లింది
బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెత్తివీ?
రాజు గారి తోటలోన మేత కెల్లినీ,
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పూల చెట్లు మేసివస్తినీ.
మేసివస్తే నిన్ను భటులు ఏమిచేసిరి?
భటులు వచ్చి నాకాళ్ళు విరుగగొట్టిరీ.
కాలు విరిగిన నీవు ఊరకుంటివా?
మందుకోసం నేను డాక్టరింటికెళ్లినీ.
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివీ?
చిక్కనైన తెల్ల పాలు అందిస్తినీ.
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమాని కేమిస్తవూ?
గడ్డి తినక ఒకపోట పస్తులుండి తీరుస్తా.
పస్తులుంటె నీకు నీరసం రాదా?
పాడు పని చేయనింక బుద్ధివచ్చెనాకు.
గణగణ గణగణ
గణగణ మనుచును
పిలిచెను బడిగంటా, ఆహా.
పిలిచెను బడిగంట
బడిలో అడుగిడి
అలజడి చేయక
పలకలు పట్టండి మీరు
పలకలు పట్టండి
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు దంతలు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు.
బడాయి పిల్లి లడాయి కెళ్ళి
మిడుతను చంపి ఉడుత అన్నది
ఉడుతను చంపి ఉడుం అన్నది
ఎలుకను చంపి ఏనుగు అన్నది
సింహం తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒకటే పరుగు
అవ్వ అంగడి పోయింది
తియ్యని బెల్లం తెచ్చింది.
కుడాలెన్నో న్నో చేసింది.
అక్కకు అన్నకు ఇచ్చింది.
మిగతావన్నీ దాచింది.
మెల్లగ పిల్లి వచ్చింది.
తినటం అవ్వ చూసింది.
కర్ర పట్టుకొని కొట్టింది.
వడివడి పడిపడి
అడుగులు వేయుచు
వేగమెరారండి మీరు
వేగమెరారండి
నా కాళ్ళ గజ్జెలు
నా కాళ్ళ గజ్జెలు- మోకాళ్ళ చిప్పలు
అబ్బబ్బ నడుము- అద్దాల రవికె
ముత్యాల హారం- కస్తురి తిలకం
బిందె మీద బిందె బిందెలోన పెరుగు
పెరుగమ్మ పెరుగు తిరుగమ్మ తిరుగు
ఆదివారంనాడు - అరటి మొలిచింది
సోమవారంనాడు సుడివేసి పెరిగింది
మంగళవారంనాడు మారాకు తొడిగింది
బుధవారంనాడు - పొట్టిగెల వేసింది
గురువారంనాడు గుబురులో దాగింది.
శుక్రవారంనాడు - పచ్చగా పండింది
శనివారంనాడు - చకచకా గెలకోసి
అబ్బాయి అమ్మాయి - అరటి పండ్లివిగో
అందరికి పంచితిమి అరటి అత్తములు
మ్యావ్ మ్యావ్ పిల్లి పాలకోసం వెళ్ళి
వంట గదికి వళ్ళి తలుపు చాటుకెళ్ళి
మూత తీసి తాగ-మూతి కాలె బాగ
అమ్మ వచ్చి చూచె - నడ్డి విరాగగొట్టె
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురము చెయనన్నది
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెమొగ్గె ముడవనన్నది
మొగుని చేత మొట్టికాయ తింటనన్నది
ఎగిరింది ఎగిరింది నా గాలి పటం
గాలిలో ఎగిరింది- నా గాలి పటం
పైపైకి ఎగిరింది- నా గాలి పటం
పల్టీలు కొట్టింది- నా గాలి పటం
రంగురంగులదండి- నా గాలి పటం
రాజ్యాలు దాటింది- నా గాలి పటం
మబ్బును తాకింది నా గాలి పటం
పందెమే గెలిచింది నా గాలి పటం
పలకల మీదను
బలపముతోను
చకచక రాయండి, మీరు
చకచక రాయండి
బడాయి పిల్లి లడాయి కెళ్లి
మిడుతను చంపి ఉడుత అన్నది
ఎలుకను చంపి ఏనుగు అంది
ఉడుతను చంపి ఉడుం అన్నది
సింహం తానని పొంగిన పిల్లి
కుక్కను చూచి ఒకటె పరుగు
చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు?
చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను
విందుకెళ్ళి చిట్టి చీమ ఏం చేశావు?
చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టాను
ముద్దు పెట్టి చిట్టి చీమ చెశావు?
పొట్టనిండ పాయసం మెక్కివచ్చాను
కొండలేమో నల్లన- కొంగలేమో తెల్లన
అకులేమో పచ్చన చిలకముక్కు ఎర్రన
పంచరంగు లివియే తెలుసుకో పాపాయి
ఉడుకవే ఉడుకవే- ఓ ఉల్లిపాయ
నువ్వెంత ఉడికినా నీ కంపుపోదు
వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్ప
వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేను నరసప్పా
ఏనుగమ్మ! ఏనుగు! నాలుగుకాళ్ళ ఏనుగు
ఏ ఊరొచ్చింది ఏనుగు?- మా ఊరొచ్చింది ఏనుగు
ఏం చేసింది ఏనుగు? నీళ్లు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన- ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రముడు ఎంతో చక్కని దెవుడు
తూర్పు పడమర ఎదురెదురు
నింగి నేల- ఎదురెదురు
ఉత్తరం దక్షిణం ఎదురెదురు
నీవు నేను- ఎదురెదురు
ఎండ ఇచ్చెది ఎవరు? సూర్యుడు! సూర్యుడు!
వాన ఇచ్చెది ఎవరు? మబ్బులు! మబ్బులు!
వెన్నెల ఇచ్చెది ఎవరు? చంద్రుడు! చంద్రుడు!
గాలి ఇచ్చెది ఎవరు? ఆకాశం! ఆకాశం!
ప్రేమ ఇచ్చెది ఎవరు? అమ్మ- నాన్న గురువూ
దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె
నాన్నకు ఐదు- అమ్మకు నాలుగు
అన్నకు మూడు- అక్కకు రెండు
పాపాయి కొకటి - నాకెమి లేవు
దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె
మొదటిది మొగ్గ- రెండోది రోజా
మూడోది ముత్యం- నాలుగోది నాగు
అయిదోది అక్క- ఆరోది ఆవు
ఏడోది ఏనుగు- ఎనిమిదోది ఎలుక
తొమ్మిదోది తొండ- పదోది పలక
ఒకతి రెండు- కలిసి ఉండు
మూడు నాలుగు- మేలు కలుగు నీకు
ఐదు ఆరు- మంచిని కోరు
ఏడు ఎనిమిది- లోకం ఎవరిది?
తొమ్మిది పది- నీది నాది మన అందరిది
ఒకతి రెండు ఒప్పుల కుప్ప
మూడు నాలుగు ముద్దుల గుమ్మ
ఐదు ఆరు అందాల భరిణె
ఏడు ఎనిమిది మయారి భమ
తొమ్మిది పది బంగారు బొమ్మ
చెమ్మ చెక్క -చేరడేసి మొగ్గ
అట్లు పోయంగ -ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క - ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క- రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క- పందిరెయ్యంగ
పందిట్లో మా బావ- పెళ్ళి చెయ్యంగ
సుబ్బారాయుడు పెండ్లి- చూచి వద్దాం రండి
మా వాళ్ళింట్లో పెండ్లి- మళ్లీ వద్దాం రండి
గుడు గుడు కుంచం గుండే రాగం,
పావడ పట్టం పడిగే రాగం,అప్పడాల గుఱ్ఱం ఆడుకోబోతే,
వేవే గుఱ్ఱం వెళ్ళికి పోతె,
అన్నా అన్నా నీ వెళ్ళి ఎప్పుడంటే,రేవు కాక, ఎల్లండి,
కత్తీ కాదు బద్దా కాదు – గప్ చుప్.
చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ
బంగారు మొలతా అత్రాడు పట్టుదట్టి,
సందె దాయతులు సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు.
కాళ్ళా గజ్జ - కంకాళమ్మా!
వేగుల చుక్కా - వెలగా మెగ్గా,
మెగ్గా గాదు - మోదుగ నీరు,
నీరు గాదు - నిమ్మల బావి,
భావి గాదు - వావింట కూర,
కూర గాదు - గుమ్మడి పండు,
పండు గాదు పాపడి మేసం.
శింగూ లిటుకు - వంది మాల్ని పటుకు,
రాజు గారి తోటలో - యేముందంటే,
వువ్వో మెగ్గొ - పుచ్చుకుంటే దెబ్బ,
కాలుదీసి - కడగా పెట్టు,
కాళ్ళా గజ్జ - కంకాళ మ్మా ..
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామ
సన్నా బియ్యం ఛాయాపప్పూ
పాలు నెయ్యి - పాయసం పొయ్యి
నీ మగడు తింటే - ఆనంద మట్టే
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామ
మినపా పప్పూ - మెంతి పిండీ
తాటీ బెల్లం - తవ్వెడూ నెయ్యీ
గుప్పెడు తింటే - కులుకూలాడీ
నడుమూ గట్టీ - నా మాట బట్టీ
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామ..
బడికి మనం వెళ్లుదాం
ఆటలెన్నో ఆడుదాం
పదములెన్నో పలుకుదాం
పాటలెన్నో పాడుదాం
అక్షరాలు దిద్దుదాం.
అమ్మ ఒడిని చేరుదాం
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం
వేణునాదం తారంగం వెంకట రమణ తారంగం
వెన్నదొంగ తారంగం చిన్నికృష్ణా తారంగం.
చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టి
సందిట తాయత్తులు సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం,
గుఱ్ఱము తిన్న గుగ్గి ళ్ళు జీర్ణమై,
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై,
భీ ముడు తిన్న పిండి వంటలు జీర్ణమై,
అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై,
అబ్బాయి తిన్న ఉగ్గు జీర్ణమై,
కుందిలాగ కూర్చొని నంది లాగా పాకి
లేడిలాగ లేచి తాంబేలు లాగ తారాడాలి ...
చేత వెన్న ముద్ద చెంగల్వ వూదండ
బంగారు మొలతరాడు పట్టదట్టి,
సందె యతులు నరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరే కొలుతు...
'గుడు గుడు గుంజం గుండే రాగం
పాముల పట్టుం పడగారాగం,
చిన్నన్న గుర్రం చిందులు తొక్కే,
పెద్దన్న గుర్రం పెళ్ళికి పోయే,
నీ గుర్రం నీళ్ళకు పోయే,
నా గుర్రం పాలకు పోయే,
కత్తెయ్యనా- బద్దెయ్యనా,
రోలెయ్యనా - రోకలెయ్యనా,
వేన్నీళ్ళు పోయనా - చన్నీళ్ళు పోయనా.
చెమ్మచెక్క.. చారడేసి మొగ్గా..
అట్లు పొయ్యంగా.. ఆరగించంగా..
ముత్యా చెమ్మచెక్క.. ముగ్గులెయ్యంగా..
రతనాల చెమ్మచెక్క.. రంగులెయ్యంగా..
పగడాల చెమ్మచెక్క.. పదిరెయ్యంగా..
పందిట్లో మా బావ... పెండ్లి చెయ్యంగా..
సూర్య దేవుడి పెండ్లి... చూసి వద్దాం రండి
మా వాళ్ళింట్లోకి వెళ్ళి... మళ్లీ వద్దాం రండి
గుమ్మాడ మ్మ గుహ్మడి,
ఆకుల్లు వేసింది గుమ్మాడి
వూవుల్లు వూసింది గుహ్మడి.
వండ్లు వండిందమ్మా గుహ్మడి,
అందులో ఒక వెండూ గుహ్మడి,
అతి చక్కని వండూ గుహ్మడి,
ఆ వండూ ఎవరమ్మా గుహ్మడి,
మా చిట్టీ తండ్ర హ్మ గుమ్మాడి.
ఏనుగమ్మా ఏనుగూ,
ఏ ఊరొచ్చింది ఏనుగూ,
మా ఊరొచ్చింది ఏనుగూ,
మంచి నీళ్ళు తాగింది ఏనుగూ,
ఏనుగు ఏనుగు నల్లాన,
ఏనుగు కొమ్ములు తెల్లాన.
ఏనుగు మీద రాముడు,
ఎంతో చక్కని దేవుడు.
బాలలం మేం బాలలం భావితరానికి దివ్వెలం
నవనాగరికత వెలుగులం- సమసమాజ నిర్మాతలం
మానవతకు వెలుగులం- మహోన్నతికి రూపాలం
వినయానికి సంపన్నులం- ఐక్యమత్య ప్రభోధకులం
తారంగం తారంగం,
తాండవ కృష్ణ తారంగం,
వేణూనాదా తారంగం,
వేంకటరమణా తారంగం,
వెన్నదొంగా తారంగం,
చిన్ని కృష్ణా తారంగం….
బావ బావ పన్నీరు,
బావను వట్టుకు తన్నేరు,
వీధీ వీధీ తిప్పేరు,
వీశెడు గంధం వూనేరు,
చావడి గుంజకు కట్టేరు,
చప్పితి గుద్దులు గుద్ధేరూ..
ఊ..ఊ..ఉంగన్నా,
ఉగ్గు పాలూ ఇందన్నా,
గుంటెడు ఉగ్గు కమ్మన్నా,
ఉప్మక ఆక్కెల వెంగన్నా,
ఊ..ఊ..ఉంగన్నా,
ఉగ్గు పాలూ ఇందన్నా లుంగలు వెట్టకు గుక్కన్నా
ఓర్వని నవతుల దిష్టన్నా
ఒప్పుగ మనలరా బుచ్చన్నా.....
"వీరీవీరీ గుమ్మడిపండు వీరి పేరేమి"
'దాగుడు మూతలు దండాకోర్!
పిల్లీ వచ్చే
ఎలుకా భద్రం,
ఎక్కడి వాళ్ళక్కడే
గప్‌చుప్ సాంబారు బుడ్డీ'
ఆటలు పాటలూ - ఆదివారం
షోకులూ సొగసులూ- సోమవారం
మాటామంతీ - మంగళవారం
బుద్దులూ సుద్దులూ - బుధవారం
గుజ్జన గూళ్ళు - గురువారం
చుట్టాలు పక్కాలు - శుక్రవారం
సంతోషం సరదాలు - శనివారం
చుక్ చుక్ రైలు వస్తుంది...
పక్కకు పక్కకు జరగండి...
ఆగినాక ఎక్కండి...
జో జో పాప ఏడవకు...
లడ్డు మిఠాయి తినిపిస్తా...
కమ్మని పాలు తాగిస్తా...
వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్పా
వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేను నరసపా
అన్నం బెట్టి, అవ్నబెట్టి,
అవ్పడం పెట్టి, దప్పడం బెట్టి,
కూర బెట్టి, నార బెట్టి, గారె బెట్టి,
బూరె బెట్టి. పాలు బోని, వరమాన్నం బోని,
గుంట గట్టి, గుంట వెంద నెయ్య లోన్,
మా అబ్బాయి అత్త వారింట్లో,
లేదంటే తాళల్ల నుండి తంగెళ్ళ నుంచి,
అదే తోవ అదే తోవ చక్కలి గిలి.
తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం
కత్తి పోయి కట్టె వచ్చె ఢాం ఢాం ఢాం
కట్టె పోయి దోసె వచ్చె ఢాం ఢాం ఢాం
దోసె పోయి డోలు వచ్చె ఢాం ఢాం ఢాం
చిట్టిపొట్టి పాపాయి
మంచి మాటలు వినవోయి
పొద్దున్నే మనమూలేవాలి.
పళ్ళూ బాగా తోమాలి
చక్కగ స్నానం చేయాలి.
ఉతికిన బట్టలు కట్టాలి
తల్లితండ్రులను కొలవాలి
అమ్మకు సాయం చేయాలి
వేళకు బడికి పోవాలి
శ్రద్ధగ పాఠం చదవాలి.
అల్లరి పనులు మానాలి
ఆటలు బాగా ఆడాలి.
సోమరి తనము మానాలి
చకచక పనులు చేయాలి
పెద్ద చదువులు చదవాలి..
ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీ కళ్ళ నీలాలుకారు
నీలాలు కారితే నేచూడలేను
పాలైన తాగవే బంగారు తల్లి..
బడికి మనం వెళదాం
ఆటలెన్నో ఆడుదాం
పదములెన్నో పలుకుదాం
పాటలెన్నో పాడుదాం
అక్షరాలు దిద్దుదాం
అమ్మ ఒడిని చేరుదాం….
అమ్మ కడుపు చల్లగా
అత్త కడుపు చల్లగా
లెక్కలేని సొమ్మెట్టుకొని
పుట్టంలేని బట్టకట్టి
అనుము - తనుము మునిమనుమలతో - వర్థిల్లాలి
ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి
అమ్మకొక ముద్ద
చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద
అందరికి పెట్టి
నువ్వు తిని-నేనూ తిని
ఆకెత్తేసి ఆకేసి వక్కేసి
సంతకు పోయే దారేది.
అత్తరింటికి దారేది ??
కోతిబావ నీకు కాస్త కోపమెక్కువ
చిలిపివాడు పలకరిస్తే చిందులెక్కువ
అరటి పండ్లు చూస్తే చాలు ఆకలెక్కువ
పిందెలన్నీ త్రుంచిపెట్ట ప్రీతి ఎక్కువ
చిలిపి పనులు చేయుటలో గర్వమెక్కువ
కర్రపుల్ల చూడగానే కంపమెక్కువ
కన్నబడ్డలంటే నీకు ప్రేమ తక్కువ
గుణము ఎంచనేల కుదురు తక్కువ..
బంగారు బాబాయి
బాలకృష్ణుడే మన బాబాయి
ఆడుకుంటూ పాటలు పాడుతాడు
మనసుకు సంతోషం కలిగిస్తాడు!
పిల్లల ఆటలూ పాటలూ,
సంతోషాన్ని తెస్తాయ్.
ఆటలలో నవ్వులు,
పాటలతో వినోదం లభించు.
మొదటి అడుగులు వేయాలె
ఆటల మైదానంలో,
పెద్దల మాటలు వినాలె
ఆటల ఆనందం మళ్లీ పాడాలె.
చిరుతులు, నక్కలు, గుడ్లు,
పట్టెళ్ళు, వెయ్యి రంగులు.
సేవలలో ఆటలు మన జంట
పిల్లలతో కలిసి గడిపేది ఆనందం.
పిల్లల ఆటలూ పాటలూ,
పాటలు మరీ నడుస్తాయ్.
ఆటలలో నవ్వులు,
పాటలతో సంతోషం లభించు.
చందమామ రాత్రి పగలు,
పిల్లలకి ఆహ్లాదం తెస్తూ.
పట్టె పసివాడు, చిన్నోడు
చందమామ ముందు ఆడుతాడు.
చందమామ కాంతిలో
పిల్లల కళ్లలో రేణువులు,
పసివాడికి కథలు చెప్పుతుందీ
విరహంలో సంతోషం పంచుతుందీ.
పెట్టె దారిలో చనిపోయి
చినుకులలో కలిసిన చందమామ,
ముహూర్తం కంటివి వెలిగిపోతోంది
పిల్లల స్వప్నాలను నింపుతుంది.
చందమామ, నీ కథలు
పిల్లల హృదయాలలో చేరుతాయి,
నీ కాంతి ముద్దుగా
పిల్లలతో పాటలు పాడుతాయి.
ఆటల పొలంలో స్నేహం పండింది,
పిల్లల నవ్వుల్లో ఆనందం నిండింది.
పాటలు పాడి, ఆటలు ఆడే,
పిల్లల జీవితం, సంతోషంగా మారే.
రంగుల బాలూ, రకం రకం బెల్లాలు,
పెద్దలతో కలిసి పాటలు పాడడం ముచ్చట.
విజయగాయకులు, ఆటల మైదానంలో,
పిల్లల సంతోషం నిరంతరం పొడుపుగా ఉంటుంది.
సూర్యుడు, సూర్యుడు, వెలుగు తేజుడు,
నిత్యం ప్రకాశం ఇచ్చే సూర్యుడు.
పిల్లల ఆటలూ, సవ్వడి వాన,
సూర్యుడు కాంతిలో వర్ణం అందాల నాణ్యమైన.
పాడుతూ జారిపడే సూర్య కిరణం,
పిల్లల తడిసే ఆశను కాపాడే ప్రేమ.
వెలుగులో వేడి, సంతోషంతో,
పిల్లల మధ్య సూర్యుడు సమీపంలో.
పుస్తకాలు, పుస్తకాలు, నాలుగు వైపులా,
సంగ్రహం చక్కటి, కవితా రాసినవి.
పిల్లలు చదువుకుంటూ, నేర్చుకుంటూ,
ప్రపంచాన్ని కళ్ళకు చూపిస్తాయి.
ఆరంభం పెడుతూ, జ్ఞానం సేకరించు,
విజ్ఞాన ప్రయాణం, చదువు జ్ఞానం.
పుస్తకాలు మనకు గౌరవం ఇచ్చే,
పిల్లల జీవితాన్ని ఆనందం చేస్తే.
అమ్మ ప్రేమ, అమ్మ కౌగిలి,
పిల్లల జీవితంలో స్వర్గం తుల్యము.
పాటలు పాడుతూ, కౌగిలి తీసి,
స్నేహం, ప్రేమ కాపాడే అమ్మ.
అమ్మ చేతిలో భద్రత, సంతోషం,
పిల్లల హృదయాలకు ఆత్మశాంతి.
అమ్మ ప్రేమ అనురాగముతో,
మనసుని ముడిపడే మధుర కవిత.
ఊసరవెల్లి, ఊసరవెల్లి,
మొక్కపై లేత పూలు,
స్నేహంగా పాడండి పాటలు,
పిల్లలతో కిక్కిరిసిపో.
ఉగాది పండుగ వస్తే,
పండ్లతో కూడిన రోజులు.
ఊసరవెల్లి గాయంగా,
పాటలు పాడుతూ గడుపుతాము.
చందమామ చందమామ,
అకాశంలో మెరుస్తున్న నక్షత్రం.
పిల్లలతో కలసి,
పాటలు పాడండి, నిద్రపోండి.
చందమామ కథలు చెప్పుతంది,
పిల్లల హృదయాన్ని సంతోషంగా చేస్తుంది.
చినుకులు లాగా సుందరంగా,
చందమామ మెరిసే కాంతి.
గోపాలకృష్ణ రారా,
మనతో కలిసి రారా.
పిల్లలతో ఆటలు ఆడి,
పాటలు పాడి సంతోషం పంచు.
చెట్టు క్రింద గోపాలకృష్ణ,
ఆడటంలో మనిషి.
స్నేహానికి పాలు పంచు,
పిల్లలతో కేల్ కిరణం.
ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా!
లోకం చూడగ కోరిక కనుకా!
పలికెదవెందుకే చిలుకా చిలుకా!
ఊహలు చెప్పగ మనసగు కనుకా!
అలిగెదవెందుకే చిలుకా చిలుకా!
కాయలు పండ్లు ఈయడు గనుకా!
కోడి పిట్ట పాడుతున్న,
మరి వినండి మనసు లొ.
పిల్లలతో కలిసి,
ఆడాలని సంతోషం రావాలి.
కోడి పిట్ట జంపులు చేస్తుంది,
పిల్లలతో పాటలు పాడుతుంది.
ఇది ఎప్పటికీ ఆడుదామని,
సంతోషం, నెమ్మదిని ఇస్తుంది.
మిరపకాయ మిరపకాయ,
పచ్చగా జంపు చేస్తుంది.
పిల్లలతో ఆడుతూ,
పాటలు పాడి సంతోషం పెడుతుంది.
స్వీట్ మిరపకాయ వినండి,
పిల్లలకి ఆనందం తెస్తుంది.
పాటలతో కలిసిపో,
పిల్లల మధ్య స్నేహం పండుతుంది.
చిలక చిలక పిట్టా,
చెట్టు పై రెప్పల కిట్టా.
పిల్లలతో పాటలు పాడుతా,
స్నేహం పాటలు శ్రేష్ఠంగా.
చిలక పాటను వినండి,
పిల్లలతో ఆనందంగా గడపండి.
పాటలలో హాయిగా,
చిలక పాటను ఆనందంగా పాడండి.
పుట్టినరోజు పుట్టినరోజు,
పిల్లల సంతోషం రోజు.
పండుగ వంటిది ఈ రోజు,
పాటలు పాడి, స్నేహం పంచు.
పుట్టినరోజు హర్షం,
అన్నివేళలా సంతోషం.
పిల్లల ఆత్మవిశ్వాసం,
పండుగవంటి రోజులు ఇవే.
ఆట పిట్ట ఆడుతున్న,
పిల్లలతో చేరండి.
పాటలు, క్రీడలు ఆనందంగా,
స్వర్గం వంటి రోజులు నిండి.
పిట్ట జంపులు చేస్తూ,
పిల్లలతో కలసి,
ఆటలు, పాటలు పాడుతూ,
సంతోషాన్ని పంచుతుంది.
పెద్ద చెట్టు పెద్ద చెట్టు,
ఆసరా నీకు పెద్దది.
పిల్లలతో స్నేహం పంచి,
ఆటలతో ఆనందం మేలు చేస్తుంది.
చెట్టు కింద కూర్చొని,
పిల్లలతో పాటలు పాడి,
చెట్టు నీ కింద స్నేహంగా,
ఆడుకోవడం హాయిగా.
తప్పట్లోయ్ తాళాలోయ్
దేవుడిగుడిలో బాజాలోయ్
పండ్లు ఫలము దేవునికోయ్
పాలూ ఉగ్గూ పాపాయికోయ్!
పిల్లలతో రాణించు.
ఆటలో నక్క కుర్చి,
పాటలు పాడుతూ సంతోషం పంచు.
పిల్లల చేతులు పట్టి,
ఆడుతూ స్నేహం గడపండి.
నక్క జంపులు, పాటలు,
పిల్లల జీవితానికి ఆనందం కలిగించు.
చెట్టు, చెట్టు, గాలిలో కదిలే,
పచ్చని ఆకులతో సంతోషం పెడే.
చెట్టు కింద కూర్చొని,
పిల్లలు ఆటలు ఆడుతారు.
పాటలు పాడి, ఆనందంగా,
చెట్టు నీడలో గడుపుతారు.
పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు,
కలిసి ఉంటారు అన్నీ.
పిల్లలతో నడుచుకుంటూ,
స్నేహంతో పండుగలు జరుపుతారు.
ఇల్లు పెద్దది, వెనక గార్డెన్,
పాటలు, క్రీడలు ఆనందంగా ఉంటాయి.
గోపాలకృష్ణ గోపాలకృష్ణ,
కీర్తనతో మనసు కాపాడే.
పిల్లలతో పాటలు పాడుతూ,
స్నేహం పెంచు, హాయిగా గడపా.
గోపాలకృష్ణ తన పాట,
పిల్లలకి హర్షం తెస్తుంది.
వాన వాన, రాతలు రానా,
పిల్లలతో సంతోషంగా మురిసి.
మబ్బులు ఆకాశంలో అలిసే,
చినుకులు కురిపించు నడుపుతూ.
పిల్లల నడకలో మురిసిపో,
వానలో ఆనందం వెదుకుతూ.
బాతుకి, బాతుకి, నీటి జలంలో,
తేలుతూ, నడుస్తూ, పాడుతూ.
పిల్లలతో కలసి పాడుతూ,
స్నేహం, ఆనందం పంచు.
బాతు రంగులతో అలంకరించు,
పిల్లల ఆనందానికి సంతృప్తి చేకూర్చు.
చేత వెన్న ముద్ద
చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు
పట్టుదట్టి సందిట తాయత్తులు
సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు..