చెప్పి చేసిన మోసం
రాజీవుడనే అతడికి కచేరీలో వుద్యోగం వచ్చింది. వుద్యోగంలో చేరిన మొదటి రోజున అక్కడే పనిచేస్తున్న రాఘవ అనే అతను రాజీవుడితో "ఇదిగో చూడు. ఈ కచేరీలో చాలా జాగ్రత్తగా వుండాలి. డబ్బులు కనబడితే చాలు అప్పలు అడుగుతారు. అవ్వమాత్రం త్వరగా తీర్చరు!” అని హెచ్చరించాడు.
ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగింది. నెలాఖరున అందరికీ జీతాలిచ్చారు. తననెవరైనా అప్పు అడిగితే కుదరదని చెబు దామని రాజీవుడు గట్టిగా నిర్ణయించు కున్నాడు. అయితే రోజులు గడుస్తున్నా తనని ఎవరూ అప్పు అడగలేదు.
ఒకరోజు రాఘవ, రాజీవుడు బజారుకు సరుకులు కొనటానికి బయల్దేరారు. రాఘవ కావాల్సిన సరులు తీసుకుని మొత్తం ఎంతివ్వాలో చెప్పమన్నాడు కొట్టువాడ్ని కొట్టువాడు. చెప్పిన మొత్తానికి అతడి దగ్గర యాభై రూపాయలు తక్కువగా వున్నది.
అస్వడు రాఘవ, రాజీవుడితో తీసుకున్న సరుకులు ఇచ్చేయడమెందుకు. ఓ యాభై రూపాయలు నర్జు. రేపు కచేరీకి రాగానే ఇస్తాను అన్నాడు. రాజీవుడు సరేనని ఇచ్చాడు.
అయితే ఎన్ని రోజులు గడిచినా రాఘవ తను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోయేసరికి రాజీవుడు దానిసంగతి అడిగాడు.
వెంటనే రాఘవ “అదేమిటి? నేను ముందే చెప్పాను కదా! ఈ కచేరీలో అప్పిస్తే అంత త్వరగా వసూలవ్వవని కొన్నాళ్ళు ఓపిక వట్టు. నా దగ్గరున్నప్పుడు ఇస్తాను” అన్నాడు.