చంద్రశేఖర్ ఆజాద్
జననం
పండిత సీతారాం తివారీ, జగరాణీదేవి దంపతులకు తేది 23 జూలై 1906 నాడు జన్మించిన ముద్దుల కుమారుడే మన చంద్రశేఖర్, ముగ్గురు పిల్లలు పుట్టి పోగా నాలుగవవాడు అర్భకుడుకాగా. అయిదవవాడుగా అందంగా జన్మించిన ఈ బాబుకు ఆనందంగా చండ్రశేఖరుడని పేరు పెట్టుకున్నారు.
బాల్యంలో బక్కచిక్కి బలహీనంగానే ఉండేవాడీ బాలుడు, అయినా చందమామలాంటి అందమైన గుండ్రని కాంతిగల ముఖం దబ్బపండులాంటి ఒంటిరంగుతో బంగారు. బొమ్మలా ఆకర్షణీయంగా ఉండేవాడు, జింకపిల్లగా అమాయకంగా కనిపించే ఆ చిన్నారి పెరిగి సింహంకొదమగా మారుతాడని ఎవరు కలగన్నారు.
తన చిట్టిబాబుకు బలమైన ఆహారమైనా పెట్టగలిగిన స్థితిలో లేని తమ పేదరికానికి ఆ తల్లి ఎంతగానో కుమిలిపోయేది. కన్నీరు కారేది, తల్లి పాల తోనే క్రమంగా ఏపుగా పెరగసాగాడా బాబు, వాడ స్త్రీ లందరూ అతనిని (పేమతో ఎత్తుకొని ఆడించేవారు.