బుస్‌... బుస్‌... నేను ఎగురుతానోచ్‌!



హాయ్‌ ఫ్రెండ్స్‌! నేనో పామును. నాకు విషం కూడా ఉంటుంది. అయినా నన్ను చూసి భయపడకండి. ఎందుకంటే. ఆశ్వ దోశ, అప్పడం, వడ.. అన్నీ ఇక్కడే చెబుతానా ఏంటీ? ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది. నేస్తాలూ.. అన్నట్లు నాకో ప్రత్యేకత ఉంది తెలుసా...? అదేంటంటే... నేను ఎగిరే పామును! అవాక్కయ్యారు కదూ! అందుకే కదా నా విశేషాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. నా గురించి తెలుసుకుంటారా మరి!

నా పేరు క్రిసోపేలియా. నన్ను ఎగిరే పాము, గ్రైడింగ్‌ పాము అని పిలుస్తుంటారు. నేను విషపూరిత సర్పాన్ని, కానీ దాని వల్ల మీకు పెద్దగా అపాయం ఏమీ ఉండదు. అది కేవలం నేను ఆహారంగా తీసుకునే కప్ప, ఎలుక, బల్లుల్లాంటి జీవులను చంపడానికే పనికి వస్తుంది. వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్‌, మయన్మార్‌, లావోస్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, భారతదేశం, చైనా, శ్రీలంకల్లో జీవిస్తుంటాను.

కరకరలాడించేస్తా...

మాలో మళ్లీ కొన్ని రకాలున్నాయి. వీటిలో కొన్ని రెండు అడుగులుంటే. మరి కొన్ని నాలుగు అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. ఇక బరువేమో 450 గ్రాముల నుంచి ఒక కిలో వరకు తూగుతాను. మేం రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాం. పగటిపూట మాత్రమే చురుగ్గా ఉంటాం. అప్పుడే ఆహారాన్వేషణ చేస్తాం. ఎక్కువగా బల్లులు, తొండలు, ఎలుకలు, కప్పలు, పక్షులు, గబ్బిలాలను కరకరలాడించేస్తాను.

వంద మీటర్ల దూరం వరకు...

మేం ఎగిరే ఉడుతల కంటే.. కూడా చక్కగా గ్రైడింగ్‌ చేస్తాం. చెట్టు కొనకు చేరుకుని అక్కడి నుంచి గాల్లోకి దూకుతాం. అప్పుడు మా పొట్టను వెడల్పుగా చేస్తాం. మా శరీరాన్ని వేగంగా కదిలించడం ద్వారా గాల్లో ముందుకు కదులుతాం. ఇలా ఒక చెట్టు నుంచి మరో చెట్టు పైకి, భూమి మీదకూ గ్రైడ్‌ చేస్తాం. ఇలా ఏకంగా 100 మీటర్ల వరకు దూకగలను. నేను పది సంవత్సరాల వరకు జీవిస్తాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! మీకు నచ్చాయి కదా! సరే ఇక ఉంటామరి.. బై.. టై..!!

Responsive Footer with Logo and Social Media