బుద్ధి హీనులు



ఒకానొక ఊరీ చెరువులో ఒక పెద్ద కప్ప ఉండేది. తాను చాలా గొప్పదానినని దానికి ఎడతెగని గర్వం దాని పిల్లలకు అది ఎప్పడూ యేవేవో లేనిపోని గొప్పలను చెప్పుతుండేది. నాకన్నా గొప్ప జంతువీ లోకంలో లేదనీ.

ఒకనాడొక ఎద్దు - ఆబోతుకన్నా పెద్దదొకటి ఆ చెరువుకు నీళ్ళు త్రాగడానికి వచ్చింది. దానిని ఈ బోదురు కప్ప పిల్లలు చూసాయి. అవి అంతకు ముందెన్నడూ ఎద్దును చూడకపోవడం వల్ల దాన్ని చూచి ఎంతో ఆశ్చర్య్మపోయాయి. అవి తిన్న్నగా తల్లి కప్ప దగ్గరకు వెళ్ళాయి. నీకన్నా గొప్ప జంతువే లేదన్నావు అదేదో కొండంత జంతువు ఒడ్డున నిలబడి నీళ్ళు త్రాగుతోందిరా చూద్దాం అని తీసుకువచ్చాయి.

కప్ప పిల్లలతో ఒడ్డుకొచ్చి ఎద్దును చూచింది. అదొక ఎద్దర్రా. దాన్ని చూచేనా మీరు ఆశ్రర్యపోతున్నారు? ఈ చెరువు చాలదనీ నేను పెరగడం లేదుగాని. అంతవడం యేమంత వింతగాదు. దానంత యేం ఖర్మ? అంతకన్నా మించే పెరుగుతాను చూడండి అంటూ ఊపిరి గట్టిగా బిగపట్టి పాట్టనుభ్ధించింది. కప్ప పిల్లలు బిలబిలలాడుతూ చప్పట్లు చరిచాయి. కప్ప మరింతగా ఉజ్బ కప్ప ఎంతో పెద్దదిగా తయారయ్యింది. భలే భలే నువ్వు చాలా గొప్పదానివి. ఇంకా పెద్దదానివీ కావాలి. ఆ ఎద్దుకన్నా పెద్దదానివి కావాలి అంటూ కప్ప పిల్లలు గోలచేశాయి. వాటిని కాదనలేక తాను చేతగాని దానినని అనిపించుకోలేక, తన శక్తి ఎంతవరకో తెలుసుకోలేక ఆ కప్ప ఇంకా ఎక్కువగా ఊపిరి బిగపట్టింది.

దానితో ఆ కప్పకు ఊపిరాడక ఉక్కిరిజిక్కిరయ్యింది. పిల్లలపట్టు మరీ ఎక్కువయ్యింది. ఊపిరి తీసుకోవాలంటే పిల్లలు యేం గేలి చేస్తాయో అని అలాగే సతమతమౌతూ తన పాట్టను ఇంకా పేద్దది చెయ్యాలనే తాపత్రయం పడసాగింది. అంతలో ఆ పాట్ట గాలి ఒత్తిడికి “థాం” అని పేలిపోయింది. ఆ కప్ప చచ్చిపోయింది.

బుద్ధి హీనులు తమ అంతస్తును మరచి, లేని గొప్పలకు పోయి తబ్బిబుల పాలై తట్టుకోలేక ముప్పనే తెచ్చుకుంటారు.

Responsive Footer with Logo and Social Media