భగవద్గీత
రామనాథం మాస్టారు చక్కని ఉపాధ్యాయులు మా త్రమే కాదు. సమయోచితమైన సలహాలతో అందరికీ మంచిని పెంచే మహామనిషి ఒకరోజు రామనాథం మాష్టారుగారు గోపీ అనే విద్యార్థి జన్మదినం సందర్భంగా భగవద్గీత పుస్తకం ఇచ్చాడు. భగవద్గీత పుస్తకాన్ని చూసి గోపితో నహా అతని స్నేహితులు గొల్లున నవ్వి “వృద్ధులకు ఉపయోగపడే భగవద్గీత యువకుడినైన నాకెందుకు బహుమతిగా ఇచ్చారు?” అని అడిగారు.
అప్పుడు రామనాధం మాష్టారు అక్కడివారిని వుద్దేశించి, “ఇది వృద్ధులు మాత్రమే చదివే పుస్తకం కాదు. మానసిక పరిపక్వత చెందని మీవంటి యువకులు చదవాల్సిన మహాగ్రంథం. ఎందుకంటే నేటి సమాజంలో యువతకు మంచి చెడుకు మధ్య , తేడా తెలీటం లేదు మహావీరుడైన అర్జునుడు సంశయ మనస్కుడై కర్తవ్యాన్ని విస్మరించి మోహసముద్రంలో పడిపోతున్న సమయంలో అతడికి సత్యం వివరించి విషాదం నుండి బయటకు లాగి కార్యోన్ముఖుణ్లి చేసింది భగవద్గీత. అందుకే ఈ గ్రంథం,ప్రపంచంలోని అన్ని భావల్లోకి తర్జుమా చేయబడింది. అలాగే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చావే శరణ్యం అని భావించే వారికి సముద్రంలో దిక్కు తెలియని నావకు దిక్చూచి 'వంటిదీ భగవద్గీత కనుక పిల్లలనుండి వ్యద్ధులవరకూ అందరూ చదవాల్సిన అద్భుత గ్రంథం భగవద్గీత" అని వివరించాడు.
రామనాథం చెప్టిన మాటల్లో సత్యం వున్నట్లు అక్కడ వున్న వారందరూ గ్రహించి చప్పట్లతో తమ హర్షం వెలిబుచ్చారు.