భగత్ సింగ్
ఏ జాతి తన శక్తిని చరిత్రను మరచిపోతుందో, అది స్వార్ధం కో మతం కోసం, ఈర్ష్య ద్వేషాలతో పరస్పరం కాట్లాడుకుంటుంది, ఆనైక్యతకు లోనై చీలుతూ నిర్భలమై ఆత్మ వినాశనం పాలవుతుంది.
ఐక్యత బలం, అది లోపించినప్పుడు అగచాస్తే ఫలం. ఆ కారణం వల్లనే మన భారతదేశం మొదట వెయ్యేండ్ల క్రితమే ముస్లింలకు, పిదప రెండు వందల యేబదేండ్ల కు పూర్వం ఆంగ్లేయులకూ లోబడింది.
బ్రిటిష్‌వారి కర్కశ పాలన, కూటనీతి, దోపిడి, “న భూతో న భవిష్యతి” అనేలా వుండేవి. కానయితే దానివల్ల కొన్ని సాంఘిక దురావారాల రవాణ, రై లు-బస్సు మార్గాలు, విద్యావ్యాప్తి జరగొచ్చు, అదయినా యెందుకు? స్వార్థ (పయోజనం కోసం,
ఏది ఏమయినా ఆ కాలంలో వ్యక్తి స్వేచ్చ లోపించింది. కుటీర శ్రమలు కుంటుపడినై , (ప్రతిభకు గు ర్తింపులేదు, ఆర్థిక స్థితిగతి క్షీణించింది, బ్రతుకుకోసం బాధలు, (పభుత్వంచేత కష్టాలు సంప్రాప్తించినయ్ జనానికి.
అట్టి పరిస్థితిలో ఒకవైపు కొంగ్రెస్ మహానేతలు స్వరాజ్యంకోసం శాంతి పోరాటం సాగిస్తుండగా, మరోవైపు సాయుధపోరాటం ద్వారా దేశ స్వాతం త్యం సాధించ పూనుకొన్నారు మరికొందరు వీరయువకులు,అట్టి క్రాంతికారు ల్లోని ఒక అమరవీరుడు సర్దార్ భగత్‌సింగ్, ఇది భరతజాతికే గర్వకారణమైన ఆ దేశభక్తుని జీవిత చరిత్ర !