భలే భలే... ధీమ్ పార్క్...!
హాయ్ నేస్తాలూ..! మనందరికీ బొమ్మలంటే భలే ఇష్టం కదా! మన దగ్గర ఎన్ని బొమ్మలున్నా... బయటికి వెళ్తే చాలు, ఇంకా కొత్త బొమ్మలు కొనివ్వమని అమ్మానాన్నలని అడుగుతాం. కొనిపెట్టే వరకూ మారాం చేస్తాం... అంతే కదూ! మరి ఆ బొమ్మల థీమ్‌తోనే ఓ పార్కు ఏర్పాటు చేస్తే. ఎలా ఉంటుంది? ఆ విశేషాలే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెంటనే ఈ కథనం చదివేయండి మరి..!
ఉత్తర కొరియాలోని జిబోంగ్-రో ప్రాంతంలో టెడ్డీబేర్ థీమ్ పార్కుని ఏర్పాటు చేశారు. సహజంగానే పిల్లలకు టెక్డీబేర్స్ అంటే చాలా ఇష్టం... అలాంటి వాటితో ఓ పార్కే ఉంటే... అక్కడికి వెళ్లడానికి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకనే... దాన్ని ఏర్పాటు చేశారట. ఆ పార్కులో ఎటు చూసినా... అన్నీ బొమ్మలే కనిపిస్తాయట. టెక్డీబేర్లు.. వంట చేస్తున్నట్లు, మ్యూజిక్ వాయిస్తున్నట్లు, వైద్యం చేస్తున్నట్లు ఇలా రకరకాల పనులు చేస్తున్నట్లు ఉండే ఆకారాలు భలే కనువిందు చేస్తున్నాయని అక్కడికి వెళ్లిన వాళ్లు చెబుతున్నారు. ఇక్కడ కేవలం టెడ్డీబేర్ బొమ్మలే కాకుండా... పిల్లలను ఆకర్షించడానికి రకరకాల జంతువులు, షక్షులు, చేపల బొమ్మలు... చాక్లెట్, కొరియన్ థీమ్ గదులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఉచితంగానే...!
ఈ పార్కుకి వెళ్లాలంటే. ఒకరోజు ముందే టికెట్లు బుక్ చేసుకోవాలంట. మరో విషయం ఏంటంటే. ప్రతిరోజు మొదటి వంద టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఉచితంగా ఒక టెక్టీబేర్‌తో ఉన్న అద్దాన్ని బహుమతిగా ఇస్తారట. రోజూ... వేల సంఖ్యలో జనాలు ఈ పార్కుకి వస్తుంటారట. ఇంకా వారాంతాల్లో అయితే... అస్సలు ఖాళీ ఉండదట. ఇక్కడ దొరికే ఆహార పదార్థాలు కూడా టెడ్డీబేర్ ఆకారంలోనే తయారుచేస్తారట. ప్రతిరోజు ఉదయం 8:80 గంటల నుంచి సాయంత్రం 1గంటల వరకు ఈ పార్కు తెరిచి ఉంటుందట. 'మన దగ్గర కూడా ఇలాంటి పార్కు ఉంటే ఎంత 'బాగుండో..' అనుకుంటున్నారు కదూ! ఈ టెక్టీటేర్ పార్కు విశేషాలు భలే ఉన్నాయి కదా నేస్తాలూ!