భలే... భలే... బుడగల ప్యాలెస్‌!



హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! మీరు ఇప్పటి వరకు ఎన్నో భవంతులు చూసి ఉంటారు కదూ! కానీ ఈ బుడగల ప్యాలెస్‌ను మాత్రం చూసి ఉండరు. 'ఇంతకూ ఇది ఎక్కడుంది? దీని ప్రత్యేకత ఏంటి?'అనే సందేహాలు మీకు ఈ పాటికే వచ్చాయి కదా! మరి ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి.. మీకే తెలుస్తుంది.

ఈ బుడగల ప్యాలెస్‌ను 'పలైస్‌ బుల్లెస్‌' అని పిలుస్తారు. ఇది ఫ్రాన్స్‌లోని కేన్స్‌ సమీపంలోని థౌల్‌ సుర్‌ మెర్‌లో ఉంది. దీన్ని హంగేరియన్‌ ఆర్కిటెక్ట్‌ ఆంటి లోవాగ్‌ రూపొందించారు. దీన్ని ఫ్రెంచ్‌ పారిశ్రామిక వేత్త పియరీ బెర్నార్డ్‌ కోసం నిర్మించారు. తర్వాత ఈ బబుల్‌ ప్యాలెస్‌ను ఫ్యాషన్‌ డిజైనర్‌ పియరీ కార్డిన్‌ కొనుగోలు చేశారు. ఈ బుడగల ఇంటి నిర్మాణం 1915 నుంచి 1989 మధ్య జరిగింది.

ఆ అయిడేళ్లు...!

2016లో ఫ్రెంచ్‌ ఆర్కిటెక్ట్‌ ఓడిల్‌ డెక్‌ ఈ భవంతిని పునర్నిర్మించారు. దీనికి దాదాపు అయిదేళ్ల కాలం పట్టింది. ఈ ఇంట్లో సకల సౌకర్యాలూ ఉన్నాయి. పది బెడ్‌రూమ్‌లు, 11 స్నానాల గదులు, 29 గదులు, రిసెప్షన్‌ హాల్‌, 500 సీట్ల సామర్థ్యమున్న ఓపెన్‌ ఎయిర్‌ యాంపీ థియేటర్‌, కొన్ని స్విమ్మింగ్‌పూల్స్‌, కృత్రిమ జలపాతాలున్నాయి. ఈ ఇంటి నిర్మాణం దాదాపు 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరిగింది. £016లో విడుదలైన 'అబ్బొల్యూట్లీ ఫాబ్యులస్‌: ది మూవీ' అనే హాస్యకథా చిత్రంలో ఈ ఇల్లును చూపించారు.

గుహలాంటి గృహం...

ఈ బబుల్‌ ప్యాలెస్‌ నిజానికి ఇల్లులా కాకుండా గుహల సముదాయంలా కనిపిస్తుంది. మానవాళి తొలి నివాసాలను అనుకరించేలా ఈ ఇంటిని నిర్మించారు. ఈ ప్యాలెస్‌ చూడ్డానికి నీటి బుడగల్లా కనిపిస్తుంది. అందుకే దీన్ని బబుల్‌ ప్యాలెస్‌ అని పిలుస్తుంటారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media