అత్యాశ
విష్ణుదత్తుడనే బ్రాహ్మణుడు కటిక దరిద్రంతో బాధపడేవాడు.
గంపెడు సంతానంతో, వారికి కడుపునిండా తిండి పెట్టలేక మదనపడుతూ వుండే వాడు. విష్ణుదత్తుడు శివభక్తుడు. శివుడ్ని నిత్యం ఆరాధిస్తుండేవాడు.
అయితే రోజులు గడుస్తున్న కొద్ది విష్ణుదత్తుడి కుటుంబ పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించకపోయేసరికి, విష్ణుదత్తుడు కోపోద్రేకుడై తన ఆర్థిక పరిస్థితులను మార్పు చేసుకోవడానికి, అడవికి వెళ్ళి శివుడి కోసం ఘోరంగా తపస్సు చేశాడు.
విష్ణుదత్తుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై “విష్ణు దత్తా... నీ తవస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో?" అన్నాడు.
దానికి విష్ణుదత్తుడు “మహానుభావా... నా గురించి, నా కుటుంబ పరిస్థితుల గురించి నీకు తెలియని దేముంది? కనుక నేను నిన్ను ఒకే ఒక వరం కోరుకోదలిచాను' అన్నాడు.
దానికి శివుడు, “కోరుకో...” అన్నాడు.
“మి దేవతల దృష్టిలో కోటిరూపాయలు ఎంతకి సమానం?” అనడిగాడు విష్ణుదత్తుడు శివుడ్ని
"కోటిరూపాయలు మాకు ఒక్క పైసాతో సమానం' అని చెప్పాడు శివుడు.
“అయితే నాకు అలాంటి పైసా నొకదానిని అనుగ్రహించండి... ప్రభూ.” అంటూ అడిగాడు విష్ణుదత్తుడు.
'తథాన్తు' అంటూ శివుడు అదృశ్యమయ్యాడు.