ఆత్మ విశ్వాసం



శేషు చిన్నప్పట్నుంచి చదువు చాలా కష్టతరమైనదిగా భావించాడు. శేషుతల్లి శాంత చదువు సులభమైనదిగా ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేవాడు. శేషు తండ్రి రంగారావ్‌ బంగారపు వ్యాపారస్థుడు. కొడుకు చెడిపోతున్నాడని తెల్సినా, కొడుకు ఇంటినుండి వెళ్ళిపోతానని బెదిరించడంతో నోరు మెదిపేవాడు కాదు ఆయన. శేషకి మామయ్య అయిన కిషోర్‌ చెన్నైలో వుద్యోగం చేస్తుండే వాడు. అక్కాబావల్ని చూడాలని వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్ధం చేసుకుని, శేషుని కొన్నిరోజులు తన వద్దకు పంవమని అడిగాడు. కొడుకు బాగుపడతాడేమో నన్న ఆశతో కిషోర్‌ వెంటపంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి, చెన్నై సిటీకి వెళ్తున్నాడని తెలిసి శేషు ఎంతో సంతోషించాడు.

చూపిం చాల్సినవన్ని కిషోర్‌ శేషుకి కొద్దిరోజులు చెన్నై అంతా త్రిప్పి చూపించాడు. అందరూ తెల్లవారేసరికి నీట్‌గా రకరకాల యూనిఫారమ్మ్‌ వేనుకుని చదువుకోవడానికి వెళ్తున్నారు. వారిని చూసి శేషుకూడా ముచ్చటపడ్డాడు. తర్వాత క్రీడా మైదానాలలో ముఖ్యమైన క్రికెట్‌ స్టేడియంకు శేషుని తీసుకెళ్ళాడు. కిషోర్ అక్కడ అ రోజు భారత్‌ - ఇంగ్లారడ్‌ల మద్య హోరాహోరీగా మ్యాచ్‌ జరుగుతుంది. టిక్కెట్స్‌ కొని ఇద్దరూ లోనికి వెళ్ళి క్రికెట్‌ ఇద్దరికి ఇంట్రస్టీ కనుక ఆసక్తిగా చూడసాగారు.

భారత్‌ ఆటగాళ్ళు ఒక్కొక్కరూ ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళకు తలవంచుతున్నారు. భారత్‌ సారథి మాత్రం ధైర్యం చెక్కు చెదరనివ్వకుండా ధాటిగా ఆడుతున్నాడు. ఒక్కసారిగా భారత్‌ ఆటగాళ్ళు తమలోనున్న శక్తియుక్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని చివరకు విజయాన్ని చేజిక్కించుకున్నారు. అప్పడు కిషోర్‌ శేషుని వుద్దేశించి శేషూ! కష్టతరమైనదని తెలిసీ కూడా మన ఆటగాళ్ళు ఎలా విజయాన్ని సౌధించారో చూశావా? ఇప్పటికైనా తెలుసుకో...ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా సాధించవచ్చునని అని నిదానంగా చెప్పాడు.

ఆ మాటలు శేషు మనసుని బాగా ఆలోచింపచేశాయి. తను చేస్తున్న తప్పేమిటో తనకి అర్థమైంది

అప్పట్నుంచి బాగా చదివి ఆత్మవిశ్వాసంతో మంచి మార్కులు సాధించాడు. రవిలో వచ్చిన మార్చుకు అతడి తల్లితండ్రులు ఎంతగానో ఆనందించారు.

ఆత్మవిశ్వాసం, పట్టుదల వుంటే సాధించలేనిది లేదు.

Responsive Footer with Logo and Social Media