అష్టదిగ్గజ కవుల్లో రామకృష్ణుడు



సభాసదులందరూ నివ్వెరపోతుండగా తాతాచార్యుల వారు లేచి "అన్యాయం ప్రభూ... ఇది మహా అన్యాయం" అన్నారు. రాయలవారు విన్మయడా చూస్తూ "అన్యాయమా... మా పాలనలోనా?" అని రెట్టించారు.

తాతాజీవారు తలపంకిస్తూ "కాడా ప్రభూ! ఎవరెవరు ఎన్నెన్ని విధాలుగా అవమానించినా చిరునవ్వుతో తలవంచుకున్నాడు. ఆస్థాన పరువు ప్రతిష్టలను మంటకలపాలన్న ఉద్దేశ్యంతో వచ్చిన ఎందరో ధూర్తులని తన సమయసూక్తితో బుజ్జి కరిపించి తమరు ఆగ్రహించినా నొచ్చుకోకుండా తమ సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ... సామ్రాజ్య రక్షణకి నిరంతరం పరితపించాను.

కావంటి మతోన్మాదులని సైతం సుతిమెత్తగా హెచ్చరించి మార్గదర్శనం గావించిన మన హితుడు, మన శ్రేయోభిలాషి, మన రామకృష్ణుడికి... కేవలం చి సత్కారంతో సరిపెట్టాలని భావించడం అన్యాయం కాదా ప్రభూ... మన వికటకవికి అర్హమైన ఘనసత్కారం ఒక్కటే... అది... తమరు సంకల్పించిన 'అష్టదిగ్గజ కవిమండలి'లో మన రామకృష్ణుడికి స్థానం కల్పించాలి.

అదే అతని ప్రతిభకి చిరు సత్కారం" అన్నారు తాతాజీవారు గంభీరంగా. "అవును ప్రభూ. ఇది మా అందరి అభిప్రాయం కూడా! రామకృష్ణుడి ప్రతిభకి అదొక్కటే తగిన గౌరవం" అన్నారు. పింగళి సూరన ద్వేషాన్ని మర్చిపోతూ, సభాసదులందరూ ఏకకంఠంతో "అవును... అవును..." అంటూ నినాదాలు చేశారు.రాయలవారు మందహాసం చేస్తూ "ప్రజాభిప్రాయాన్ని విజయనగర ప్రభువులు గౌరవిస్తారు. మీ అందరితో పాటు మా మనసులో వున్నది కూడా అదే... ఈ ప్రజాదర్బారులో... సమస్త ప్రజానీకం సమక్షంలో రామకృష్ణుల వార్ని సగౌరవంగా 'అష్టదిగ్గజ కవిమండలి'లోకి ఆహ్వానిస్తున్నాం. రండి.

రామకృష్ణా.... యీ సముచిత ఆసనాన్ని అలంకరించండి. 'అష్టదిగ్గజ కవి'గా మా ఘనసత్కారాన్ని అందుకోండి..." అని ఆహ్వానించారు. మరుక్షణం అల్లసాని పెద్దనగారు, పింగళి సూరనగారు ఎదురేగి రామకృష్ణుడ్ని చెరోవైపునా చేతులు పట్టుకుని సగౌరవంగా తీసుకువచ్చి ఆసనంలో ఆశీనుడ్ని కావించాయి.

ముక్కు తిమ్మనగారు గంధ, పుష్పాక్షితలు అలంకరించగా, ధూర్జటిగారు పన్నీరు చిలకరించారు. రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రము. ప్రౌఢకవి మల్లన పుష్పమాలలు వేసి, పూలకిరీటం అలంకరించారు.

అంతట రాయలవారు స్వయంగా రామకృష్ణుడికి దుశ్శాలువ కప్పి, చేతికి స్వర్ణకంకణాన్ని తొడిగి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆపై రాజగురువు తాతాచార్యుల వారు స్వయంగా వేదమంత్రాన్ని చదువుతూ ఆశీస్సులందించారు. మహామంత్రి అప్పాజీవారు శుభాశీస్సులు పలికారు.

ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ చప్పట్లు మార్మోగుతూనే ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు నియామకంతో 'అష్టదిగ్గజ కవిమండలి' పూర్తయింది. తనకి లభించిన అపూర్వ ఆదరణకి, గౌరవానికి, రాయలవారు తనపట్ల చూపిన అభిమానానికీ రామకృష్ణుడు ఉప్పొంగిపోతూ

నరసింహ కృష్ణరాయని

కరమరుదగు కీర్తివెలయు కరిభిద్గిరిభి

త్కరి కరిభిద్దిరి గిరిఖీ

త్కరిథి ద్గిరిభిత్తురంగ కమనీయం బౌ

అని చెప్పాడు. మరుక్షణం కరతాళధ్వనులతో సభాస్థలి దద్దరిల్లిపోయింది.

Responsive Footer with Logo and Social Media