అందమైన తోక పక్షి…
హాయ్ నేస్తాలూ...! ముందు నన్ను ఆశ్చర్యంగా చూడటం మానేసి... చెప్పేది వినండి. ఇంతకీ ఎలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నా! నాలాంటి పక్షిని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు కదా! అందుకే నా విశేషాలన్నీ మీతో పంచుకుందామనే ఇలా వచ్చాను. మరి ఆలస్యం 'చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి.
నన్ను తైవాన్ బ్లూ మాగ్‌పై అని పిలుస్తారు. ఇంకా నాకు “లాంగ్ టెయిల్డ్ మౌంటైన్ లేడీ' అనే 'పేరు కూడా ఉంది. నేను కాకి జాతికి చెందిన జీవిని. మాలో ఆడ, మగ పక్షులకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. నా తల, మెడ నలుపు, కళ్లు పసుపు... ముక్కు, కాళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. రెక్కల అంచున తెలుపు రంగు ఉంటుంది. ఇక మిగతా శరీరమంతా నీలం రంగులో ఉంటుంది. నా తోక విప్పితే చాలా అందంగా ఉంటుంది తెలుసా! నేను తైవాన్‌లో తప్ప ఇంకెక్కడా కనిపించను.
భయం లేదు...!
సాధారణంగా కొన్ని పక్షులు మనుషుల మధ్యకు రావడానికి భయపడతాయి. కానీ నాకు అలాంటి 'భయాలేమీ లేవు. ఎంచక్కా మనుషులున్న చోట కూడా తిరుగుతాను. నాకు గుంపులుగా ఉండటం ఎక్కువ ఇష్టం. మీకో విషయం తెలుసా... మా గుంపుని “లాంగ్ టెయిల్డ్ ఫార్మేషన్' అని పిలుస్తారు. కాకుల్లాగే నేను కూడా గట్టి గట్టిగా అరుస్తాను.
అన్నీ తింటా!
ఆహారం తినడంలో నాకు పెద్దగా నియమాలేమీ లేవు. పాములు, కీటకాలు, పక్షుల గుడ్లు, పండ్లు, విత్తనాలు... ఇలా ఏవి దొరికితే అవి తినేస్తాను. అందుకే నాకు ఆహారానికి కూడా కొరత ఉండదు. నేను ఆహారాన్ని అస్సలు వృథా చేయను. తినగా మిగిలితే... దాన్ని ఆకుల్లో దాచుకొని మరీ తింటాను. నాకు గబ్బిలాలు, గద్దలు అంటే చాలా భయం. అవి నన్ను ఎక్కువగా వేటాడతాయి. నా పొడవు 68 నుంచి 88 సెంటీ మీటర్లు ఉంటుంది. అందులో తోక పొడవే. 34 నుంచి 4£ సెంటీ మీటర్లు. చూడటానికి కాస్త పెద్దగా ఉన్నాను కానీ... నా బరువు £54 నుంచి 260 గ్రాములు మాత్రమే. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!