అల్లాఉద్దీన్ అద్బుతదీపం
చాలా చాలా సంవత్సరాల క్రిందటి సంగతి. అరేబియా దేశంలో భారతదేశంలోలాగానే అనేకమంది మహారాజులు, చక్రవర్తులు ఉండేవారు. అంతే కాక వింతలకు, విచ్చిత్రాలకు ఆ దేశం 'పెట్టిందిపేరు. మాయాజాలాలకు, మాంత్రి కులకు చాలా ప్రసిద్ధి కెక్కింది ఆ దేశం. అక్కడ ప్రజలను ఆరబ్బులంటారు, వారి భాష అరబ్బీ భాష, వారి మతం ఇస్లాం మతం. అరబ్బులు వ్యాపారం చేయడంలో ఎంతో పేరు గడించారు. 'దేళంలో చాలా భాగం, ఎడారి (ప్రాంతం కావడంవల్లl వారు ఒంటెలమీద సరకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకొని పోయి, అమ్ముకుంటూ ధనం గడించేవారు.
“అరేబియన్ నైట్స్” అనే కథలు ప్రపంచ ప్రఖ్యాతిని పౌందినవి. ఇవి వెయ్యిన్నొక్క కథలున్నట్లు చెబుతారు. (పవంచంలోని దాదాపు అన్ని భాషలలోనికి ఇవి తర్జుమా అయ్యాయి. ఆ కథలలో “ఆల్లావుడ్జీన్ అద్భుత దీపం” అనే కథ లోక ప్రసిద్ధి చెందినది. బాలలూ! ఆ కథే మీకిప్పుడు చెబుతాను.
మక్కా. నగరం'పేరు విననివారు. ఉండరు: ముస్లింలకు ఆది పవిత్ర యాత్ర స్థలం. మహమ్మదీయుడై నవాడు. జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కా. యాత్రచేసి, జన్మ చరితార్థం చేసుకోవాలని అనుకుంటాడు. (ప్రవక్త మహమ్మదు జన్మించిన పరమ పవ్మిత స్థలమైన మక్కాకు వెళ్ళి, అక్కడ మసీదును దర్శించి తరించాలని కోరుకుంటాడు. ఆ మహానగరంలో ఎన్నో పవిత్రమైన మసీదులున్నాయి. అంతేకాక ఎందరో (్రీమంతులు పెద్దపెద్ద భవంతులలో, మేడలలో సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. అలాగే ఎంతోమంది నిరుపేదలు కూడ అక్కడ నివసిస్తూ ఉంటారు. పేదవారి పేటలు, గుడిసెలు అక్కడ లెక్క. లేకుండఉంటాయి.
“ఉంటే నవాబు, లేకపోతే పకీరు” అన్న సామెతగా కలవారు ఎన్నో భోగవిలాసాలతో కులుకుతూ ఉంటే, లేనివారు. మురికి వాడలలో తిన తిండి, కట్టు బట్ట లేకుండా నికృష్ట జీవితం గడుపుతూ ఉంటారు. ఆ నగరంలో ముస్తఫా అనే దర్జీ వాడున్నడు . ఆతడు చాలా బీదవాడు. అతని భార్య వట్టి అమా యకురాలు, చాలా మంచిమనిషి* వారికి ఒక్కడే కొడుకు. దేవుడైన అల్లా "పేరుమీద: “అల్లావుడ్దీన్” అని ఆ పిల్లవాడికి "పేరు పెట్టారు. ఒక్కడే కుమారుడు కావడంవల్ల తల్లిదండ్రులకు అతనంటె ఎంతో ప్రేమ , తల్లి మరి గారాబంగా చూచుకునేది. ముస్తఫా గుడ్డలు కుట్టి, వచ్చే కొద్ది సంపాదనతో ఎంతో కష్టంమీద సంసారం పోషించుకుంటూ ఉన్నాడు: కాని+ ఆల్లాఉద్జీన్‌కు చదువు సంధ్యలు అబ్బలేదు. వాడు అల్లరి చిల్లరిగా, మురికివాడలలో ఉండే కొంటె పిల్లలతో కలిసి తిరుగుతూ, గోలీకాయలు మొదలైన ఆటలు ఆడుతూ అస్తమానం గడు పుతూ ఉండేవాడు. తండ్రి ముస్తఫా, కుమారుడికి ఎన్నోసార్లు బుద్ధులు చెప్పాడు. తల్లి కూడ అప్పుడప్పుడు మందలిస్తూ ఉండేది. అయినా అల్లావుదీనకు బుద్ధి రాలేదు. అతని ప్రవర్తన మారలేదు. ముస్తఫా తన దురదృష్టాన్ని తలుచు కుంటూ, కాలం వెళ్ళదీస్తూ వచ్చాడు
ఇలా ఉండగా: అల్లాఉద్దీన్ పదేళ్ళ కుర్రవాడుగా ఉన్నప్పుడు, అతని
తండ్రి ముస్తఫా చనిపోయాడు. అప్పుడా తల్లీ కొడుకులు దిక్కులేని వాళ్ళయి
నారు. తోటి ముస్లిమ్‌లు వారి దీనావస్థను చూచి, “అయ్యోపాపం” అనే వాళ్ళే
కానిః తగిన సహాయం చేసేవారుకారు. ముస్తఫా భార్యకు, ఇల్లు గడపటం
చాలా కష్టంగాఉండేది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనేక రకాల వనులుచేసి, సంపాదించిన
ధనంతో ఎలాగో కొడుకు అల్లాఉద్దీన్‌ను పోషించుకుంటూ వచ్చింది. కాలం
గడిచింది అల్లాఉద్దీన్ పదిహేనేళ్ళ వాడై నాడు.
ఇలా ఉండగా, ఒకనాడు ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు.
పిల్లలతో కలిసి బజారులో ఆడుకుంటూఉన్న అల్లాఉద్దీన్‌ను చూచాడు. వాడి
వాలకాన్ని జ్యాగ_త్తగా పరీక్షించాడు. తనకు కావలసిన కుర్రాడు అతనేననీ,
తన కార్యము ఆతని ద్వారానే సాధించుకోవచ్చున నీ గ్రహించాడు.
ఆక్కడే ఆడుకుంటున్న మరో పిల్లవాడిని పక్కకు పిలిచి అతని ద్వారా
అల్లాఉద్దీన్ వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఎంతో పరిచయమున్న వాడి
లాగా అల్లాఉద్దీన్ దగ్గరికి వెళ్ళి “ఏరా నాయనాః ఎలా ఉన్నావురా? ఎంత
కాలానికి చూసాను నిన్ను?” అని [ప్రేమగా పలకరించాడు. కుర్రవాడై న అల్లా
ఉద్దీన్‌కు, అతనెవరో తెలియదు. అందుచేత బిత్తరపోయి. చూచాడు. అది
కనిపెట్టి మాంత్రికుడు, “ఏరా నాయనాః నేనెవరో అని అనుకుంటున్నావా? పిచ్చి
సన్నాసీ! నేనెవరినో కాదురాః మీ చిన్నాన్నను మీ ఇంటికి పోదాం పద మీ
నాన్నా, అమ్మా బాగున్నారా? నేను వాళ్ళను చూచి ఎన్నో ఏళ్ళు అయింది”
ఆని అంటూ, ఆల్లాఉద్దీన్‌ను దగ్గరికి తీసుకొని ముద్దులాడాడు.
పాపం పసివాడైన ఆల్లాఉద్దీన్ ఆతను చెప్పినదంతా నిజమేనని నమ్మి,
ఎక్కడలేని సంతోషంతో మాంత్రికుడిని వెంట బెట్టుకొని, తన ఇంటికి తీసుకొని
వెళ్ళాడు. “రాండి చిన్నాన్నా! ఈ గుడిసే మా ఇల్లు. ఉండండి! మా అమ్మను
పిలుచుకొని వస్తాను!” అని అంటూ లోపల ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తు
కుంటూ వెళ్ళాడు. “అమ్మా! అమ్మా! చూడు మనింటికి ఎవరొచ్చారో! మా
చిన్నాన్నట. నాయనగారికి స్వయానా తమ్ముడట. బజారులో నన్ను చూచి
ప్రేమతో పలకరించాడు, మనింటికి తీసుకొని వచ్చాను” అని చెప్పాడు. ముస్తఫా
భార్య, ఇది విని నివ్వెరపోయింది.
“చిన్నాయనా! ఎవ్వరా ఆయన? నీకెవరూ చిన్నాన్నలు, పెద్ద నాన్నలు
లేరే!” అంటూ తలుపు తీసుకొని ఇవతలికి వచ్చింది.
ముస్తఫా భార్యను చూచీ చూడగానే, మాంత్రికుడు, “సలామ్ వదిన
గారూ! నేను మీ మరిదిని, మీరు సన్ను ఎరథ గరు.. నేను చిన్నప్పుడే, మా
అన్నగారికి పెళ్ళికాకముందే, దేశాలకు వెళ్ళిపోయాను. దేశ దేశాలు తిరిగాను.
ఏదో కాస్త సంపాదించాననుకో! మీకు నేను కొత్త కావచ్చు. కాని ఈ పిల్ల
వాడిని చూడగానే, మా అన్నగారి పోలికలను బట్టి వీడు మా అన్న కొడుకే
అయిఉంటాడని గుర్థించాను” అని అన్నాడు.