అలవాట్లు


మాధవుడు సుభద్రకు అన్న, వయసుకు పెద్దేకాని, చదువులోను పనిలోను సుభద్ర కన్న చిన్నవాడులా ఉండేవాడు.

రోజూ ప్రొద్దున ఎనిమిది గంటల వరకు నిద్రపోయే మాధవుడిని సుభద్ర లేపేది. “లేరా అన్నయ్యా, తొమ్మిదింటికల్లా భోజనం చేసి సిద్ధం కాకపోతే బడికి ఆలస్యమౌతుంది. ఇంకా నిద్రపోతూ ఉంటే ఎలారా?” అంటుంది.

“అబ్బ నువ్వు పోవే, నిద్ర ముంచుకొస్తూ ఉంటే ఏం చెయ్యమంటావు? అని కసిరిమాధవుడు ముసుగు నెత్తినిందా తన్ని, పడుకునేవాడు. ఇంకా కాసేపటికి, అమ్మ అతడిని బలవంతంగా లేపి కూర్చోపెట్టేది.

మాధవుడు సరిగ్గా పళ్లు తోముకోడు. వళ్లు రుద్దుకుని స్నానం చెయ్యడు. “అదేమిరా నాయనా” అని వాళ్ల అమ్మ అడిగితే వేళ లేదంటాడు.

బళ్లో పాఠాలు మాధవుడికి ఎన్నాళ్ళైనా కొత్తే. పాతవీ కొత్తవీ అంటూ వేరే లేవు. అన్ని పాఠాలూ అతనికి కొత్తవే.

బడికి వెళ్లేటప్పుడు అతను పట్టుకు పోవలసిన పుస్తకాలు సుభద్ర సర్టిపెడుతుంది. తనైతే చేతికి ఏవి దొరికితే అవే పట్టుకు వేళ్తాడు. రోజూ ఏదో ఒక పుస్తకం తక్కువ వస్తుంది.

'బళ్లో పంతులు మాధవుడిని ఇంటికి పోయి పట్టుకు రమ్మంటాడు. అతడు ఇంటికి పోయి, దారిలో ఉన్న వస్తువులన్నిటినీ తన్నుకుంటూ, దొర్లించుకుంటూ నడుస్తాడు. తల్లి “ఏమిరా! మాధవా ఒకటే గొడవ చేస్తున్నావు?” అని అడుగుతుంది.

నా భూగోళం పుస్తకం కనిపించలేదమ్మా అంటాడు. పాపం ఆమె కూడా వెతుకుతుంది. చాలాసేపటిదాకా అది కనిపించదు. అప్పుడతని చిన్నెచెల్లి, “అదెట్లా ఉంటుందిరా, అన్నయ్యా?” అని అడుగుతుంది. “కాస్త పాతగా ఉంటుందే” అని విసుక్కుంటాడు మాధవుడు. ఓహో! దాని నిండా చమురు మరకలుంటాయి కదూ? దానికి ఒక్కటే అట్టకదూ?” అని ఆమె అడుగుతుంది. “అవునమ్మా, రెండో అట్ట చినిగిపోయింది” అంటాడు. “అయితే పోయి వంట ఇంటి వెనకాల బొగ్గుల బుట్టలో ఉంటుంది తెచ్చుకో” అంటుంది చిన్న చెల్లి. పుస్తకాలంత చక్కగా దాస్తాడు మాధవుడు. బళ్లో కల్లా, ఏమీ రాని అబ్బాయి మాధవుడని పిల్లలందరికీ తెలుసు.

మాధవుడి తండ్రి మంచివాడు. మాధవుడిని ఎప్పుడూ కొట్టడు. ఎన్నిసార్లో చెప్పాడు. బుద్ధిగా బద్ధకం లేకుండా చదువుకోవాలని.
'మాధవుడైనా చెడ్డవాడు మాత్రం కాడు. చాలా సున్నితమైన మనస్సు అతనిది. కాని అతనిలో కొంత హడావుడి ఉన్నాయి, చప్పున నిద్ర లేవడు, లేచినప్పుడు పక్కమీది దిండూ, దుప్పటీ తోచినవైపుకు విసిరి, పళ్లు తోముకోడానికి బయలు దేరుతాడు. “వాళ్ళమ్మతో ఎవరైనా అదేమిటండీ మాధవుడు అంత చెప్పిన మాట వినడు, బొత్తిగా చదువులో శ్రద్ధలేదు” అంటే “మా మాధవుడు పెంకివాడు మాత్రం కాదండి, వాడికింకా (ప్రపంచ జ్ఞానం కలుగలేదు” అంటుంది. అట్లా పొరుగువారికి నచ్చచెప్పినా ఆమె మనస్సులో చాలా బాధపడుతుంది. తన మాధవుడు మంచివాడైనా చెడ్డపేరు తెచ్చుకుంటున్నాడే అని విచారిస్తుంది.

మాధవుడికి చుట్టవక్కల వాళ్ళూ బళ్లో పిల్లలూ తనను గురించి చెడ్డగా అనుకుంటున్నారని చాలాసార్లు తెలిసింది, నిజమే, తల్లీ తండ్రీ ఎంత ముద్దుగా చెప్పినా తనుమాత్రం బద్ధకాన్ని పోగొట్టుకోలేకపోయాడు. చాలాసార్లు బద్ధకాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నాడు. రాత్రి పడుకోబోయేటప్పుడు మర్నాడు తల్లి లేచేసరికి తనూ లేవాలని చాలాసార్లు అనుకున్నాడు. కాని ఉదయం చెల్లి సుభద్ర లేపినా లేవబుద్ధి వేసేదికాదు. పైగా చెల్లిని కోప్పడే వాడుకూడా,

ఇట్లా ఉండగా మాధవుడి తండ్రికి జబ్బు చేసింది. ఇంట్లో తల్లీ సుభద్రా తండ్రికి ఉపచారాలు రాత్రీ పగలూ (శ్రద్ధగా చేస్తున్నారు. తను మాత్రం ఆలస్యంగా నిద్రలేచి, చేతికి దొరికిన పుస్తకాలు మాత్రమే తీసుకొని బడికి పోతున్నాడు.

బళ్లో చెల్లెలి తరగతి పిల్ల ఒకనాడు, “సుభద్ర బడికెందుకు రావడం లేదు” అని అడిగింది. “మా నాన్నకు జబ్బుగా ఉంది” అని మాధవుడు చెప్పాడు.

బళ్లో పిల్లలు తమ తండ్రుల జబ్బులను గూర్చీ, తల్లుల జబ్బులను గూర్చీ మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక పిల్లవాడు తన తండ్రి జబ్బుచేసి చనిపోయాడని చెప్పి, కంట తడిపెట్టుకున్నాడు... మాధవుడు ఆ పిల్లవానివైపే చాలాసేపు చూశాడు. అతనికి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. “నాన్న ఎంత మంచివాడు! ఆయనకూడా ఆ పిల్లవాని తండ్రిలా చనిపోతాడా? అమ్మో! ఇంకేమైనా ఉందా!” అనుకున్నాడు. మాధవుడికి ఉన్నట్టుండి భయం వేసింది. ఆ వేళ పంతులుతో చెప్పకుండానే తరగతి విడిచి ఇంటికి వెళ్లిపోయాడు.

ఇంట్లో సుభద్ర తండ్రి వద్ద కూర్చుని ఉంది. తల్లి వంట ఇంట్లో పనులు చూచుకుంటోంది. తండ్రి మాధవుడిని చూసి “ఏం నాయనా, పుస్తకమేదైనా మరిచిపోయావా?” అని అడిగాడు. మాధవుడు తిన్నగా వచ్చి తండ్రి కాళ్ల దగ్గిర కూర్చున్నాడు. “నాన్నా నీకు ఎట్లా ఉంది?” అని అడిగాడు.

“బాగానే ఉంది బాబూ, కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందంతే, నీకు వేళైంది పో బాబూ” అన్నాడు తండ్రి. “నాన్నా ఇవాళ మళ్లీ బడికి పోను” అని కళ్లల్లో నీరు పెట్టుకున్నాడు.

తండ్రి మాధవుడిని పరీక్షగా చూసి, బళ్లో ఎవరైనా అతన్ని గేలిచేసి ఉండాలి అనుకుని “పోనీలే ఇవాల్టికి బడికి పోకు” అని “మాధవా, నువ్వు బద్ధకం పోకొట్టుకోవాలి నాయనా చెడ్డ అలవాట్లు ఎప్పటికైనా పోగొట్టుకోవాలి. సుభద్రచూడు, నీకన్న చిన్నది అయినా దానికి మంచి అలవాట్లున్నాయి. నువ్వు చాలా మంచి పిల్లవాడివి. ఐనా ఎవ్వరూ నువ్వు మంచివాడవని అనరు. చెడ్డ అలవాట్లు పోగొట్టుకోవడం మొట్టమొదట కష్టం అనిపించినా, పట్టుదలగా ప్రయత్నం చేస్తే తప్పక అవిపోయి మంచి అలవాట్లు ఏర్పడుతాయి” అన్నాడు. అప్పుడు సుభద్ర అంది. “చూడరా అన్నయ్యా, నాన్న జబ్బులో కూడా, నీ గురించే ఎంతగా ఆలోచిస్తున్నారో!” అని.

మాధవుడు ఏమీ మాట్లాడలేదు. అవేళల్లా తండ్రి దగ్గరే ఉన్నాడు. “పోయి పడుకో” అని రాత్రి తల్లీ తండ్రీ చెప్పిందాకా పోయి పడుకోలేదు. మర్షాడు ఉదయం తల్లికన్నా ముందుగా నిద్రలేచి పళ్లు తోముకుని, స్నానంచేసి, తండ్రికి పళ్లు తోముకుందుకు నీళ్లు తాటాకు పళ్లపోడి తీసుకువచ్చి ఒక కుర్చీ పీట మీద పెట్టాడు.

తండ్రి కళ్లు తెరిచేసరికి మాధవుడు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. “రాత్రి నిద్రపట్టలేదా మాధవా?” అన్నాడు తండ్రి. “పట్టింది నాన్నా” అన్నాడు మాధవుడు.

ఆ రోజు కూడా మాధవుడు బడికి పోలేదు. సుభద్రను “పోయి అమ్మకు సాయం 'చెయ్యి” అని తను తండ్రి దగ్గరే కూర్చున్నాడు. ఆ వేళ ఇంట్లో వస్తువులను తన్నుకుంటూ దొర్లించుకుంటూ నడవలేదు. అతని మనస్సు ప్రశాంతంగా ఉంది. తనపనులన్నీ ఎవ్వరూ జ్ఞాపకం చెయ్యకుండానే చేసుకుపోయాడు. అతని తల్లి అతనిలో వచ్చిన మార్చుచూసి సంతోషించింది. భర్తతో మన మాధవుడు ఎప్పటికైనా మారుతాడని నేను అనుకుంటూనే ఉన్నాను అని అంది.

మర్చాటి నుండి తండ్రికి ఆరోగ్యం బాగవుతూ వచ్చింది. మాధవుడు బడికి వెళ్లాడు. బళ్లో అతిశ్రద్ధగా చదువుతున్నాడు. పంతుళ్ళంతా మాధవుడి తెలివితేటలు మెచ్చుకుంటున్నారు. బళ్లో పిల్లలంతా, "ఏమిరా మాధవా ఉన్నట్టుండి నువ్వు ఇంత మారిపోయావు!” అంటే “ఇది వరకు నాకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉండేవి. ఇప్పుడు వాటిని పోగొట్టుకున్నాను అంతే” అనేవాడు.

ఇప్పుడు మాధవుడికి మంచి అలవాట్లవల్ల వచ్చే లాభం బాగా తెలిసింది. బళ్లో ఎవరైనా చెడ్డ అలవాట్లు గల పిల్లవాడుంటే దగ్గర కూర్చోబెట్టుకుని “పట్టుదలగ వాటిని పోగొట్టుకోవాలి” అని చెప్తాడు.

“అట్లా పోగొట్టుకుంటే బళ్లోను ఇంట్లోను అంతా ఎక్కువగా గౌరవించి ప్రేమిస్తారు” అని కూడా చెపాడు.

ఇప్పుడు మాధవుడి తల్లినిగాని, తండ్రినిగాని “మీ పిల్లవాడు చెప్పిన మాట వినడేం?” అని అడిగేవాళ్లు లేరు. మాధవుడికి తల్లీతండ్రీ “అదిచెయ్యి ఇదిచెయ్యి” అని చెప్పవలసిన అవసరం లేదు. సుభద్ర నిద్రలేపవలసిన అవసరం కూడా లేదు, బళ్లో పాఠాలన్నీ పాతవైనై,

Responsive Footer with Logo and Social Media