అలా అనుకుంటే... పొరపాటే!



హాయ్‌ నేస్తాలూ..! ఫొటో చూడగానే... ఏదో షాపింగ్‌మాల్‌ అనుకున్నారు కదా! అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే. అది గ్రంథాలయం కాబట్టి. మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. జర్మనీలోని స్టట్‌గర్ట్‌ సిటీ లైబ్రరీ ఇది. ఈ గ్రంథాలయాన్ని 'టెంపుల్‌ ఆఫ్‌ బుక్స్‌' అని కూడా పిలుస్తారు. ఈ లైబ్రరీ ఎనిమిది అంతస్తుల్లో ఉంది. లోపలికి వెళ్లగానే... ఏ పుస్తకాలు ఎక్కడున్నాయో...

తెలుసుకోవడానికి నోటీస్‌ బోర్డు, ఆడియో సదుపాయం కూడా ఉంటుంది. ఒక్కో అంతస్తులో ఒక్కో విభాగానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఎవరైనా అక్కడికి వెళ్లి ఉచితంగానే పుస్తకాలు చదువుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే. ఇక్కడికి సంవత్సరానికి దాదాపు పది లక్షల మంది వస్తుంటారట. అన్ని భాషలకు సంబంధించిన కొన్ని వేల పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయట.

క్యూబ్‌ ఆకారంలో ఉండే ఈ గ్రంథాలయాన్ని కొరియాకు చెందిన ఎన్‌ యంగ్‌ యి అనే అర్కిట్ట్‌ డిజైన్‌ చేశాడట. మీకో విషయం తెలుసా... ఇక్కడ ఏ అంతస్తులో ఏ చోట కూర్చున్నా బయటి వాతావరణం కనిపించేలా... వెలుతురు లోపలికి వచ్చేలా నిర్మాణంలో గాజు ఇటుకలు ఉపయోగించారట. ఈ గ్రంథాలయం విశేషాలు భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media