అందని ద్రాక్ష పుల్లన
ఒక అడవిలో నక్క ఒకటి నివసిస్తుంది. ఒకరోజు అది ఎంత వేటాడినా ఆహారం దొరకలేదు. ఆకలితో అది బాధపడుతుంది. ఆకలి బాధను తీర్చుకోవడానికి ఏదో ఒకటి తినాలని వెతకసాగింది. ఎంత వెతికిన దానికి ఆహరం లభించలేదు. అంతలో దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది.
అప్పటి వరకు నక్క ఆ ద్రాక్ష తోటను ఎన్నడూ చూడలేదు. అక్కడి వాతావరణం దానికి బాగా నచ్చింది. ఆ ద్రాక్షపళ్ళు చాలా ఎత్తుగా ఉండటంతో నక్కకు అందలేదు. ఆకలితో ఉన్న ఆ నక్కకు ద్రాక్షపళ్ళను చూడగానే తినేయాలనుకుంది. ఎలాగైనా వాటిని తినాలని పైకి ఎగిరి ప్రయత్నించింది, కానీ అవి అందలేదు, తిరిగి ప్రయత్నించింది.
అలా చాలాసార్లు ఎగిరినప్పటికీ ద్రాక్షపళ్ళు అందక పోవడంతో నిరాశ చెందింది. పట్టు వదలకుండా మళ్ళీమళ్ళీ ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. నక్కకు అందనంత ఎత్తులో ద్రాక్షపళ్ళు ఉన్నాయి. ఎన్నో రకాలుగా ప్రయత్నించిన నక్క అలసిపోయింది. దాని శరీరంలోని శక్తి అంతా నశించింది. దాంతో ద్రాక్షపళ్ళ కోసం ఎగిరే ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే ద్రాక్షపళ్ళు తినాలనే దాని ఆశ మాత్రం చావలేదు.
నిరాశగా వెనుతిరిగిన నక్క తనను తాను ఓదార్చు కుంటూ “ఈ ద్రాక్షపళ్ళు చాలా పుల్లగా ఉంటాయి, అందుకే అందలేదు. ఇకపై వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు” అని తనను తాను సమర్థించుకుంది.
నీతి కథలు : మనకు అందని దాన్ని గురించి చెడుగా చెప్పడం చాలా సులభం.