Subscribe

యే జాతికీ చందలేని గబ్బిలాలు



ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి. ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి జంతువులు నేగ్గేవి.

ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేసాయి. ఏ జెట్టు గెలుస్తుంటే అటు వైపుకి మారిపోయి ఇటు జంతువులను, అటు పక్షులను రెండిటినీ మోసం చేసాయి. గబ్బిలాలు అంటే బాట్స్.

యుద్ధం జరుగుతున్నన్ని రోజులు యే జెట్టు ఈ విషయం గమనించలేదు.

ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగేక పక్షులు, జంతువులూ బాగా అలిసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి, సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా వుండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని, ఒక నిర్ణయం చేసుకున్నాయి.

యుద్ధం ముగిసి పోయింది.

కాని, ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు

వెళ్ళాయి. కానీ చాలా సార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానీయలేదు.

పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని తిరస్కరించాయి.

యే ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక, అటు మృగాలు కా లేక వంటరిగా ఉండిపోయాయి.

Responsive Footer with Logo and Social Media