బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర


1.జీవితం నాటికాలం

భీమారావు రాంజీ అంబేద్కర్‌ జీవితం (1891-1956) ఆధునిక భారతదేశ చరిత్రలోని అతి ముఖ్యమైన దశబ్దాలతో ముడిపడి ఉంది. 1885లో 'భారత జాతీయ కాంగ్రెస్‌ అవతరణ ద్వారా ఆధునిక జాతీయోద్యమానికి బీజాలు పడ్డాయి. అటు తర్వాత ఆరు సంవత్సరాలకు (1891) ఆయన జన్మించారు. ముందుముందు వివరించినట్లు, విస్తరిస్తూ మార్పులు చెందుతూ వుండిన జాతీయోద్యమంతో అంబేద్కర్‌కి ఉండిన సంబంధం క్లిస్టమైనదీ, సమస్యాత్మకమైనదీ అయినప్పటికీ, ఆ నేపథ్యంలో ఆయన జీవితం సాగిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే దేశాన్ని ఆమూలాగ్రం ఒక ఊపు ఊపుతుండిన ముఖ్యమైన విప్లవాత్మకమైన మార్పులను కలిగినట్టి సంచలనాత్మకమైన ఆ దశాబ్దాలను కేవలం ' జాతీయోద్యమం ' అనే ఒక్కమాటతో ముడిపెట్టడం సబబుకాదు వాస్తవానికి భారత జాతీయ భావన ఆవిర్భావం, సత్వర పెరుగుదలలు ఆర్టిక, సామాజిక సాంస్కృతిక రంగాలలోని లోతైన మార్పులకు చెందిన రాజకీయ వ్యక్తీకరణలు మాత్రమే ఆ మార్పులను ఒక్కమాటలో పేర్కొనాలంటే ' ' ఆధునికత'* అని అంటే సరిపోతుంది ఇది వైరుధ్యాలు, గందరగోళాలు కలిగినట్టి వ్యవస్త ఇది కనిపించనీ, కనిపించే అవరోధాలు ఉన్నటువంటి బాధాపూరితమైన పద్దతి అయినప్పటికీ భారతదేశం, 'నెమ్మదిగానైనా, స్తీరంగా ఆధునికతను సంతరించుకుంటూ ఉండిందని ఒప్పుకోకతప్పుదు. వ్యావసాయిక, జమీందారీ, మోతుబరి ఆర్థిక వ్యవస్త నుంచి భారతదేశం తనదైన క్లిష్షమైన గందరగోళపు తరహాలో ఉండే ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్తలోకి మార్పు చెందుతోంది. పదేపదే జపిస్తుండే *సోషలిష్టుతరహా సమాజం', “సామ్యవాదం అనేపదాలు ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చ ప్రయత్నిస్తా యన్నది నిస్సందేహం అయితే 1990 లొ జరిగిన వాస్తవం, స్వామ్యవాదాన్ని ఓ తోపుతోసి నెట్టి వేసింది. నాటి సమాజం కూడా నెమ్మదిగా అయినప్పటికీ స్పష్టమైన రూపురేఖలతో వ్యక్తిత్వనికి ప్రాధాన్యాన్నిచ్చే, స్వయం ప్రయోజన పూరితమైన, కేం(ద్రీకృతమవుతూ 'బహిర్గతమవుతూండిన వర్గవ్యవస్తతో హేతువాద- మతాతీత- మానవత్వపు ఆధునకీకరణ విలువలుగల ఆధునిక సమాజ దిశలోకి మారుతోంది. అయితే ఈ మార్పువేగం ఆధునిక సమాజదిశలో త్వరితంగానూ, ఘనంగానూ వచ్చే మార్పుల ద్వారా లబ్ది పోందగలమని ఆశించిన అస్పృశ్యులకు, నిమ్నుకులాల వారికి సంతృప్తిని కలిగించలేదు. వాస్తవానికి స్వయంగా అంబేద్కర్‌ కూడా భారతదేశంలో ఆధునకీకరణ ప్రణాళికలో ద్యోతకరువుచుండిన మాంద్యం,

మందగమనం పట్ల చాలా అసహనం చెందాడు. సాంఘిక పరమైన మార్పులకన్నా కూడా సంస్కృతీరంగానికి చెందిన స్పష్టమైన, దృడ మైన విలువలలో, 'బహిరంగమైన, 'గోప్యమైన (ప్రవర్తనలలో స్వాప్నిక , అచ్చాదితమైన అచేతన రంగాలలో ఈ మార్పు మరింత మందంగా ఉండింది. అంబేద్కర్‌ జన్మించిన కాలంలో, ఆధునకీకరణ సాగుతుండగా, తదుపరి కాలంలొ విస్పోటం చెందడానికి సమాయత్తమవుతుండిన వైరుధ్యాల,గందరగో ళాల ప్రకంపనాలు, చరిత్ర ఉపరితలం క్రింద, బలమైన సంభాక్యాలుగ అణిగిమణిగి ఉన్నాయి.

అంబేద్కర్‌ వ్యక్తిత్వ జీవితం వికసించేసరికి, ఇని వాస్తవాలుగా విస్పోటం 'చెందసాగాయి ఈ చారిత్రక నేపథ్యంలో భీమరావు రామ్‌జీ అంబేడ్కారకు మధ్య భారతంలోని మౌ అనే ఊరిలో రామ్‌జీ సక్‌పాల్‌ భీమాభాయి దంపతులకు పదునాలుగవ సంతానంగా 1891 వ సంవత్సరం ఏప్రెల్‌ 14 వ తారీఖున జన్మించాడు.అంబేద్కర్‌ కుటుంబం స్వతగా మహరాష్టలోని కొంకణ్‌ ప్రాంతానికి చెందినది. వారి పూర్వీకుల గ్రామముల అంటే రత్నగిరి జిల్లాలో వుంది. ఈ సందర్భంలో ఆయన కుటుంబ నేపద్యనికి చెందిన కొన్ని ముఖ్యంమైన విషయాలను తెలిసికొన అవసరముంది . ముందుగా అంబేద్కర్‌ అస్పృశ్యూలలో మిహర్‌జాతికి చెందినవాడు. ఈ మిహార్‌లు సామాన్య పరిజ్ఞానం విషయంలోనూ పరీస్తితులకు అనుగుణంగా పట్టు 'విడుపులతో సరపెట్టుకునే విషయంలోనూ అస్పృత్యజాతులన్నింటిలోకి బాగా అభివృద్ది తెందినవారు, చైతన్యవంతులు. మహర్‌ల కుటుంబలో జన్మించిన శిశువు మంచి యోధుడుగా, లక్ష్యసిద్దిని సాధించిగల (ప్రతిభతో అన్యాయాలనూ, అవమానాలనూ సహించని లక్షణాలతోనూ ఉంటాడని ఆశించడంలో ఆనౌచిత్యం ఏమీలేదు. ఆపైన అంబేద్కర్‌ కుటుంబానికి సైనిక 'నేపథ్యం ఉంది. అతని తం(డ్రి రామ్‌జీ, తాత మాలోజీ బ్రిటిష్‌ పాలనలో సైన్యంలో పనిచేశారు. నిజానికి మౌ కూడా సైనికకేంద్రమే - కంటోన్మెంట్‌ ప్రాంతం. భీమారావు తల్లి కూడా సైనిక నేపథ్యం వున్న కుటుంబం నుంచి వచ్చినదే. అంబేద్కర్‌ భావి జీవితానికి వున్న ప్రాధాన్యం దృష్ట్యా ఆయన జన్మకి 'సంబంధించినగాధ ఒకదానిని మననం చేసుకొనడం సముచితంగా ఉంటుంది.

రామ్‌జీ బాబాయిలలో ఒకాయన సన్యాసం స్వీకరించి వెళ్ళిపోయాడట. ఆయన రామ్ జీకి చరిత్రలో గాఢమైన ముద్రవేసే కుమారుడు ఒకడు ఆయన కుటుంబంలో జన్మిస్తాడని వరం ఇచ్చాడట. ఇక పోతే మూడవ అంశం. మానవులు ఏదో ఒక మతం పట్ల విశ్వాసం కలిగి ఉండక తప్పదని జీవిత పర్యంతం అంబేద్కర్‌కి ఉండిన ప్రగాఢ విశ్వాసం. అంబేద్కర్‌ కుటుంబం కబీర్‌ పంధా ప్రవచించిన ప్రజాస్వామిక విలువలు, మానవత్వపు దృష్టి కలిగిన భక్తి సాంప్రదాయానికి చెందినది. ఈ సందర్భంలో కబీర్‌ కుల వ్యవస్తకు వ్యతిరేకంగానూ , భగవంతుని దృష్టిలో మానవ సమానత్వం గురించీ ప్రజోధించిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోవడం ఉచితంగా ఉంటుంది.

సైన్యంలో పదవీ విరమణ తర్వాత రామ్‌జీ రత్నగిరి జిల్లాలోని దపోలికి మకాం మార్చాడు. ఐదవ యేట పసి భీమరావుని స్తానిక మరాఠీ స్కూల్‌లో 'జేర్చారు. అటు తర్వాత ఆయనకీ మాజీసైనిక హోదాలో పౌర ఉద్యోగంపై 'సతారాకి బదిలీ అయినప్పుడు భీమరావు 1900 లో స్టానిక గవర్నమెంట్‌ స్కూల్‌లో హైస్కూల్‌ చదువుకొనసాగించాడు. స్కూల్‌ రిజిస్టర్లో ఆయన పేరు భీమరామ్‌జీ అంబావాడేకర్‌ అన్నపేర నమోదయింది. ఆయన కుటుంబం కూడా సకపాల్‌ అన్న స్వతహా ఇంటి పేరు బదులు ఈ పేరు ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. భీమరావు ఐచ్చికంగా ఉంచుకున్న ' అంబేద్కర్‌' అన్న ఇంటిపేరు 'వెనక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. హైస్కూల్‌ టీచర్లలో ఒకాయనకి భీమరావుపట్ల ప్రత్యేక ఆసక్తి ఉండి అతనిని సాక్షాత్తు తన ఆశ్రీతునిగా చూసుకోసాగాడట. తన గురువు పట్లవున్న గౌరవం, అభిమానాలకు సూచనగా ఆయన ఇంటిపేరును తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. స్కూల్‌లో అంబేద్కర్‌ నాటి ప్రతి అస్పృశ్య బాలునిలాగా విచక్షణకు గురి అయ్యాడు... అతనిని ఇతర బాలురకు దూరంగా కూర్చోమనేవారు. వాళ్ళతో కలిసి తిరడం, ఆడుకోవడంపై ఆంక్షలు విధించారు. ఆస్పృశ్యూ లు దేవభాష నేర్చుకోవడానికి అనర్హులన్న నెపం మీద సంస్కృత అధ్యాపకుడు అంబేద్కర్‌కు సంస్కృతం నేర్పడానికి ఒప్పుకోలేదు. ఈ కారణంగా సంస్కృతం నేర్చుకోవాలన్న అభిలాష, . ప్రబలంగా వున్నప్పటికీ ఆతడు తప్పనిసరిగా పార్సీ నేర్పుకోవలసి వచ్చింది... అధ్యాపకులు అంబేద్కర్‌తో సహ అందరు అస్పృ శ్య బాలుర పుస్తకాలు. ముట్ట్తుకోడానికి ఇష్టపడేవారు కాదు. కలుషితమయిపోతామన్న భీతితో వారు. అస్పృశ్య విద్యార్థులతో ముఖతః మాట్లాడడం కాని కనీసం ముఖం వంక చూస్తూ చర్చించడం కాని చేసేవారు కాదు. సున్నితమైన మనసు , ప్రతిభకలిగిన అంబేద్కర్‌ వంటి విద్యార్ధి ఇట్టి అవమానాలను ఒక సగటు అస్స్ఫశ్యబాలుని కంటె అధికంగా అనుభవించి ఉండాలి. |1904లో తన నౌకరీ అంతిమయినిప్పుడు రామ్‌జీ తన కుటుంబాన్ని బొంబాయికి మార్చాడు పరేల్‌లోని సాంప్రదాయి చావడి (చావల్‌) లోని ఒకే గది వున్న భాగంలో కిరాయికి జేరాడు. ఆ కుటుంబం ఒక పెద్ద తిరగలికి, ఒక 'మేకకి కూడా జాగా వెతుక్కోవలసి వచ్చింది. మొదట్లో పరేల్‌లొని మరాఠా హైస్కూల్‌లో చేరినా తదుపరి ప్రభుత్వ నిర్వహణలో ఫున్న సంప్ర ఎలిఫెన్‌ స్టోన్‌హైస్కూల్‌లో జీరాడు. బొంబాయిది భేధభావాలు లేని నగర వాతావరణం కావడంతో ఈ మహర్‌ కుర్రవాడు క్రికెట్‌ ఆడడానికి ఆంక్షలు రాలేదు. ఒక విద్యార్థిగా భీమరావు పఠనం పట్ల అసామాన్యమైన ఆసక్తిని ,విజ్ఞాన సముసార్జన పట్ల తీరని తృష్ణను ప్రదర్శించాడు. 1907 లో అతను మెట్రిక్‌ ప్యాసయ్యూడు. ఒక మహర్‌ కుర్రవానికి అది గణనీయమైన కార్యం ఈ సందిర్బాన్ని సత్యశోధక్‌ సమాజ సంస్కరణ ఉద్యమ నాయకుడైన యిస్‌.కె. బోలె అధ్యక్షతన తగు విధంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా కే . ఎ . కెలూస్కార్‌ రచించిన బుద్దుని జీవితచరిత్ర గ్రంధాన్ని, భవిష్యత్తును సూచిస్తున్నదా అన్నట్లు అంబేద్కర్‌కు బహుకరించారట అంబేద్కర్‌కి స్కూల్లో ఫిఫ్తు స్టాండర్డ్ చదువుతున్న రోజుల్లోనే పదునాలుగవ యేట వివాహం అయింది. పెండ్లికుమార్తె రమాబాయికి అప్పుడు కేవలం తొమ్మిదేళ్ళు. ఆమె భికు వలంగ్‌కర్‌ కుమార్తె. బరోడ సంస్థాన పాలకుడైన మహారాజా శాయాజీరావు గాయక్వాడ్‌ సంస్కరణ భావాలు కలిగిన రాజు ఆయన ఇచ్చిన ఇరవై ఐదు రూపాయల స్కాలర్‌షిప్‌ సహాయంతో అంబేద్కర్‌ ఎలిఫెన్‌స్టోన్ కాలేజీలో కాలేజీ విద్యాభ్యాసం కొనసాగించాడు. ప్రొఫెసర్‌ ముల్లర్‌ పుస్తకాలను, దుస్తులను ఇచ్చి సహాయం చేశాడు. బొంబాయిలో కూడా సాంఘికపరమైన అవమానాలు సంపూర్తిగా సమసిపోలేదు. హాస్టల్‌లో అతనికి టీీకాని, నీళ్ళుకాని ఇచ్చేవారు కాదు. అప్పటికి అంబేద్కర్‌ కుటుంబం ఆర్థికంగా బాగా పుంజుకుంది. అందువల్ల వారు ఇంప్రూమెంట్‌ ట్రస్ట్‌ చానల్‌లో రెండు గదులున్న భాగంలోకి మారారు. కాలేజీలో వుండగానే, తొలి పుత్రసంతానం యశ్వంత్‌ పుట్టడంతో అంబేద్కర్‌ తండ్రి అయ్యాడు. 1913 లో ఆయన ఇంగ్లీషు, పర్షియనులు పాఠ్యంశాలుగా బి యే. పరీక్ష ప్యాసయ్యాడు. ఆయితే క్లాస్‌కాని, డిస్టింగ్\క్షన్‌కాని రాలేదు. అదే సంవత్సరంలో ఎంతగానో ఆత్మీయత పెంచుకున్న తండ్రి మరణించాడు. ఆముదుసలి తన సర్వస్వాన్ని కుమారుని విద్యకోసం త్యాగం చేశాడు.

పట్టభోద్రుడైన తర్వాత అంబేద్కర్‌ తన తం(డ్రి వాంఛితానికి విరుద్దంగా బరోడా స్వదేశీ సంస్థన సర్వీసులో చేరాడు. ఆ సంస్థానంలో ఉన్నత వర్గాల వారి గుత్తాధిపత్యం ఉండింది. ఒక్కసారిగా అట్టివారితో సమానహోదాతో వారి మధ్యకు దూసుకు వెళ్ళినట్లయింది. అవి సవర్ణ హిందువుల మనసులలో 'మైలపడడం అనే భావన లోతుగా ధూసుకుపోయిన రోజులు ఆ కారణంగా అంబేద్కర్‌ తన క్రింది బాగా తక్కువ స్థాయి ఉద్యోగుల వల్లకూడా ఎన్నో అవమానాలకు గురికావలసి వచ్చింది. ఎప్పటిలాగే మంచి నివాస ప్రాంతాలలో ఇల్లు దొరకడం గగనమయింది. ఆయన ఒక ఆర్యసమాజవాదితో కలిసి నివసించ జొచ్చాడు కాని సమాజపు అణగార్చే లక్షణం ఆయన్ను తినివేయి సాగింది ఆయన ఆ రొంపలోంచి బయటపడడానికి అవకాశం కోసం ఎదురు ” చూస్తుండ సాగాడు 1913 లొ అంబేద్కర్ న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో తన ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత సంస్థా నంలోనే పనిచేసేందుకు ఒప్పందంపై సంతకం చేశాడు. అది గొప్ప చారిత్రక సంఘటన. ఎందుకంటే తన జాతి నుంచి విదేశీ విద్యను అభ్యసించిన వ్యక్తి ఆయనే, కొలంబియాలో తనఅస్పృశ్య ముద్ర మూలంగా అసౌకర్యం చెందలేదు. నవ సమసమాజ సూర్యకాంతితో చలి కాచూ కోసాగాడు. ఆయన రోజుకి పద్ధేనిమిది గంటలు కష్టపడి చదివేవాడు. |ప్రొఫేసర్‌ సెలిమాన్‌ వంటి (ప్రఖ్యాత ఆర్టిక శాస్త్రివేత్త ఆయనకు ఆచార్యుడుగా ఉండడం ఆయన అదృష్టం. ఆయన అమెరికాలో వుండగా రెండు విశేష సంఘటనలు జరిగాయి. మొదటిది ప్రఖ్యాత స్వాతం త్రయోధుడు లాలాలజపతిరాయ్‌తో సమావేశం. రెండవది ఒకవిద్వద్గొష్టీలో భారతదేశం లో కులాల ఆవిర్భావం గురించిన ఒక సమ గ్ర పత్రాన్ని 'చదివడం, అందులో ఆయున కులం ప్రధాన లక్షణం అంతిర్వివాహామని ఇలా. తనుకులంలోనే వివాహాం చేసుకున్నందు వల్ల పేటికలో బంధించినట్లయిందని వాదించాడు. తదుసరి ఈ పత్రం 'ఇంటియిన్‌ అంటిక్విటీ' అనే పత్రికలో ప్రచూరితమయింది. అంతకుముందు ఆయన “ప్రాచీన భారత వాణిజ్యం' (ancient indian commerce) అనే పరిశోధన పత్రం సమర్పించడం ద్వారా ఎం, ఎ. పట్టా పోందారు. 1916 జూన్‌లో ఆయనకి “నేషనల్‌ డివిడెండ్‌ ఫర్‌ ఇండియా - ఎ హిస్టారిక్‌ అండ్‌ అనలిటికల్‌స్టడీ' (national dividend for india-a historic and analytical study) అన్న పరిశో ధనాంశం మీద డాక్టరేట్ లభించింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ పరిశోదనా గ్రంథం..'ది ఇవొల్యూషన్‌ ఆఫ్‌ ప్రొవిన్సియల్ పైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా'” అన్న పేర పుస్తకం వెలువడింది. ఇందులో తన ఉపోద్ఘాతంలో (ప్రొఫెసర్‌ సెలిమాన్‌ ఈ గ్రంథం బడ్జెట్‌ చర్చలలో భారత శాసన సభ్యులకు బహు ఉపయోగకారిగా ఉండగలదని పేర్కొన్నాడు.

అంబేద్కర్‌ ఆమెరికాలోని కొలంబియా నుంచి పాశ్చాత్య (ప్రపంచంలోని మరో ప్రఖ్యాత విద్యాకేంద్రం - యునైటెడ్‌ కింగ్‌డం లోని 'ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పాలిటికల్‌ సైన్స్‌కి గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌గా వెళ్ళాడు. ప్రొసెసర్‌ సెలిమాన్‌ ఇచ్చిన పరిచయ లేఖతోవెళ్ళి ప్రఖ్యాత ప్రొఫెసర్‌ కానన్‌, సిడ్నీవెబ్‌లను కలుసుకున్నాడు. బార్‌- ఎట్‌లా పట్టా పోందడానికి గ్రెస్ ఇన్‌లో ప్రవేశం కూడా అభించింది. అయితే బరోడా మహరాజు స్కాలర్‌షిప్ ను ఆపివేయడంతో అంబేద్కర్‌ తన యం. ఎస్‌.సి. సిద్దాంత వ్యాసంపై ఒక సంవత్సరం కృషిచేశాక అర్ధంతరంగా భారతదేశానికి తిరిగి రావలసివచ్చింది. అయితే (ప్రోఫసర్‌ కానన్‌ జౌదార్యం వల్ల ఆయనకి అక్టోబర్‌ 1917లోగా గల నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా తిరిగి వచ్చి విద్యాభ్యాసాన్ని కొనసాగించగల వెసులుబాటు కలిగింది.

భారతదేశానికి తిరిగివచ్చాక ఆయన బరోడా మహారాజు కొలువులో మిలిటరీ సెక్రటరీగా జేరాడు. ఇది సంస్థానంలో ఆర్ధిక మంత్రి పదవిని చేపట్టడానికి తొలి మజిలీ. ఆయితే మాతృభూమికి తిరిగివచ్చాక ఆయనకి అవమానాలు తప్ప వేరేమీ స్వాగతం పలుకలేదు. ఘనమైన విద్యావిషయక గౌరవాలతో తిరిగివచ్చిన ఆ స్థానికునికి ఏ విధమైన స్వాగత సత్కారాలూ లేవు.. కనీసం ఉండడానికి ఏ హోటల్‌లోకాని హాస్టల్లోకాని రవ్వంత జాగా అభించలేదు. తానెవరో బహిర్గత పరచకుండా ఒక పార్సీ సత్రంలో తలదాచుకో వలసి వచ్చింది. తన సొంత ఆఫీసులో ప్యూన్‌లు కాగితాలను, ఫైల్స్‌ను ముందు విసిరివేసేనారు. ఒక్క గ్లాసుడు నీళ్ళు కూడా తెచ్చేవారు కాదు. పార్సీ సత్రం నుంచి ఆయన ఒక శరణార్ధిలాగా పబ్లిక్‌ లైబ్రరీకి మారవలసి వచ్చింది. ఈ విషయంలో తగుచర్య తీసుకోవలసిందిగా ఆయన మహారాజా వారికి విన్ననించుకున్నాడు కాని ఫలితం లేకపోయింది. సవర్ణ హిందువులలో లోతుగా 'పాతుకుపోయిన దురభి ప్రాయాలనుంచి తన వ్యక్తిగత విజయాలు తనని రక్షించలేకపోతున్నందుకు ఎంతో ఆవేదన చెందాడు. విపరీతమైన మనో వ్యాకులతతో, అశ్రునయనాలతో ఆయన బరోడా సంస్థానం నుంచి 'వెడలిపోయాడు. 1917లో ఆయన తిరిగి బొంబాయి జేరుకున్నాడు, బొంబాయిలో ఆయనను అభినందించడానికి ఏర్పాటైన సభలో అధ్యక్షస్థానం వహించవలసిన సర్‌చిమన్‌లాల్‌సెటెల్‌నాడ్‌ సభకు రానేలేదు. ఇదే సమయంలో అంబేద్కిర్‌' 'స్మాల్ హోల్డింగ్స్ ఇన్‌ఇండియా అండ్‌ దెయిర్‌రమెడీస్‌' ' అన్న అద్భుతమైన, పాండితీ ప్రకర్పగల గ్రంధాన్ని రచించాడు. బొంబాయిలో ఆయన తన జీవన విధానాన్ని, బ్రతుకు తెరువును పరిస్థితులకు అనుగుణంగా మార్పుకోవలసి వచ్చింది ఆయన విద్యార్దులకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు, స్టాక్‌లు, షేర్లు గురించి సలహాలు ఇచ్చే సంస్థను కూడా స్థాపించాడు. కాని ఒక అస్పృశ్యుని దగ్గరకు సలహా సంప్రదింపులకోసం వెళ్ళిడమనే ఆలోచనను భరించలేని కస్టమర్‌లు ఎవరూ వెళ్ళక పోవడంతో అది దెబ్బతింది. కొంత విరామం తర్వాత అంబేద్కర్‌ బ్రతుకు తెరువుకోసం ఒక పార్సీ వ్యాపారివద్ద 'పద్డులూ, ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడానికి కుదురుకున్నాడు. 1918 నవంబర్‌లో బొంబాయిలోని పిజెన్‌హామ్‌ కాలేజీలో (ప్రొఫెసర్‌ ఆఫ్‌ పాలిటికల్‌ ఎకనమిగా తాత్కాలిక ఉద్యోగం లభించడంతో కొంత తెరిపి చిక్కింది. అక్కడ ఆయన ప్రేరణ కలిగించిగల ఉత్తమ అధ్యాపకునిగా గాఢమైన ముద్ర 'వేయగలిగాడు. ఆయిన పాఠాలు వినడావకి బయిట కాలేజీ విద్యార్థులు కూడా వచ్చి గుమిగూడేవారట. అయితే ఇంచుక ఆయిన పాందుతుండిన 'సాంఘికపరమైన అవమానాలు తగ్గించేదేమీ లేదు. స్టాఫ్ రూంలోని మంచినీటి. కుండనుంచి నీరు తీసుకోడానికి అగ్రవర్ణాల సహాధ్యాయులు ఒప్పుకొనేవారు కాదు. 1920 మార్చిలో అంబేడ్కర్ ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి లండన్‌లో ఎకనామిక్‌, లీగల్‌ స్టాడీస్ కొనసాగించడానికి వెళ్ళిపోయాడు. ఈసారి కొల్హాపూర్‌ మహరాజా ఆయనకి అవసరమైన ఆర్ధిక సహాయం చేశారు.

అంబేద్కర్‌ లండన్‌ వెళ్ళేముందు సౌత్‌బరో కమిషన్‌ ఆన్‌ ప్రాన్‌ఫస్‌ ముందు కుల ప్రాతిపదికపైన నియోజక వర్గాలు ఉండాలని తన వాదాన్ని వినిపించాడు ఈ కమిషన్‌ 1922 పిబ్రవరిలో తన సిఫార్సులను (ప్రకటించింది. ఇవే తదుపరి వచ్చిన మాంట్‌ఫోర్డ్‌ రాజ్యాంగ సంస్కరణలకు ప్రాతిపదిక, 1920 జనవరిలో ఆయన దళిత వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో '' మూక్‌నాయక్‌' * (మూకవాణి నేత) అన్న వారపత్రికను ప్రారంభించారు. తొలి సంచికలో ఆయన నాటిహ్జెందవ సమాజలక్షణాలైన సాంఘిక అసమానత, అన్యాయం, అణలివేతలను నిశితంగా విమర్శిస్తూ తన అభిప్రాయాలను సుస్పష్టం చేశాడు. పత్రికా నిర్వహణకు అవసరమైన నిధులను కొల్హాపూర్‌ మహారాజా సమకూర్చినా, స్వల్పకాలపు ఆస్థిత్వం తర్వాత ఆ పత్రక మూతిసడవలసి వచ్చింది. అంబేదర్‌ 1918 లో నాగపూర్‌లోనూ, 1920 లో కొల్హాపూర్‌ లోను జరిగిన దళిత మహాసభలలో పాల్గొన్నారు. కొల్హాపూర్‌లో ఆయన “సంఘటిత సమీకరణం'* (organised mobilisation) అన్న ముఖ్యమైన సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. '* అస్పృశ్యులు నిర్వహించని పక్షంలో సంస్థలకు కాని, వ్యక్తులకు కాని దళితుల ప్రయోజననాలను పరిరక్షించే హక్కు లేదు. అనేదే ఈ సిద్దాంతం, సంఘటిత కార్యాలలో స్వయంశక్తి పై ఆధారపడవలసి... అవసరాన్ని నొక్కి చప్పే ఈ సిద్ధాంతం అణచబడ్డ వర్గాల పాలిటి మౌలికమైన పునాదిరాయి అయింది. అంబేద్కర్‌ వి.ఆర్‌. షిండే నాయకత్వంలొ ఏర్పడిన “డిప్రెస్‌డ్‌క్లాసెస్‌మిషన్‌' ' ను ప్రత్యేకించి వ్యతిరేకించారు.

1920 సెప్టెంబరులో అంబేడ్కర్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌లోనూ, గ్రేస్‌ ఇన్‌ లోనూ ఏకకాలంలో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఈ ద్వితీయ విదేశీ విద్యాభ్యాసకాలంలో లంబేద్కర్‌కు అందుబాటులో ఉన్న ఆర్ధికవనరులుఅంతంతమా(త్రం. అయితే అదృష్ట. వశాత్తూ కొల్హపూర్‌ మహరాజా అయిన సాహుమహరాజా ఆయనకు బాసటగా నిలిచాడు. ఆయన ముందుటికంటే మరింత కష్టపడుతూ తరచుగా భోజనాలు మానివేస్తూ గడపసాగాడు. విశ్రాంతికి, వినోదానికి సంబంధించిన అంశాల నన్నింటిని ఆయన తన దినచర్య నుండి తొలగించాడు. తద్వారా తన విద్యా 'విషయిక లక్ష్యాల సిద్ది విషయంలో ఆయనకుండిన అకుంఠిత దీక్షను (ప్రదర్శించాడు. స్వాభిమానం గల ఆయన భార్య పుట్టింటికి వెళ్ళినా తన ఆర్ధిక అవసరాల కోసం నగానట్రను అమ్మివేయడానికి ఇష్టపడిందేకాని ఇతరుల సహాయాన్ని తీసుకోలేదు, 1921 జూన్‌లో ' ప్రావిన్షియల్‌ డిసెం ట్రలైజేషన్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ (బ్రిటిష్‌ ఇండియా! అన్న అంశంమీద. అంబేద్కర్‌కు ఎం. ఎస్‌.సి, డిగ్రీ లభించింది. బాన్‌ యూనివర్శిటీలో కొద్దికాలం విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆయన “ది ప్రాబ్లం ఆఫ్‌ ది రుపీ- ఇట్స్‌ ఆరిజన్‌ అండ్‌ ఇట్స్‌ సాల్యూషన్‌ '” అన్న సిద్దాంత వ్యాసాన్ని డి. ఎస్‌. సి ( ఎకనామిక్స్‌ డిగ్రీ } కోసం లండన్‌ యూవివర్శిటీకి సమర్పించాడు. ఆయన ఈ డిగ్రీ పాందడమేకాకుండా దానిని లండన్‌లో ప్రచురింపచేయగలిగాడు. ఆ గ్రంధం ఉపోద్దాతంలో ప్రొఫెసర్‌ కానన్‌ అంబేద్కర్‌ (ప్రతిభను ఘనంగా ప్రస్తుతించాడు. ఈ గ్రంధం 1947 లొ “హిస్టరీ ఆఫ్‌ ఇండియిన్‌ కరెన్స్‌ అండ్‌ బాంకింగ్‌' అన్న పేర భారతీయు ప్రతిగా 'పునర్ముద్రిత మయింది. 1923 లో అయునకు న్యాయవా దిగా బార్‌లో (ప్రవేశం. లభించింది. ఆ సమయంలొ ఆయన అస్పృశ్యుల సమస్యల గురించి అప్పుటి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇండియూ అయిన ఇ యస్‌. మాంటగూ, విఠల్‌భాయి పటేల్‌లతో చర్చలు జరిపారు.

అంబేద్కర్‌ 1923 జూన్‌లో బొంబాయి హైకోర్ట్ న్యాయవాదిగా. (ప్రారంభించారు. ఆయన ఆర్ధిక పరిస్తితి తటిఎంతటి దారుణంగా ఉండేదంటే . “సనద్‌' కి కట్టడానికి కూడా ఆయన దగ్గర సొమ్ము లేకపోయింది. ఆయిన." ఆపెలేట్‌ వర్క్‌ మొదలు పెట్టారు. అయినా అస్పృశ్యుడు అనే మచ్చ ఆయన్ని... వేట కుక్కలాగా వెంటాడుతోనే ఉంది. ఆయని అస్పృశ్యు డు అన్న కారణంగా . సోలిటర్‌లు ఆయనతో ఏ విధమైన కార్య సంబంధాలు పెట్టుకోడానికి ఇస్టపడలేదు. ఆయన తన వృత్తిని గ్రామీణ ప్రాంత'ల కేసులకే పరిమితం చేయవలసి వచ్చింది. కార్మీక నాయకుడు యన్ . యం . జోషి సహాయంతో. అంబేద్కర్‌ పరేల్‌లోని దామోదర్‌ హల్‌లో తనఆఫీసును తెరువగలిగారు , నాటి. సమాజంలో అణచివేత వాతావరణం ముమ్మరంగా ఉండినా కొందరు సహృ 'దయులైన వ్యక్తులు అంబేద్కర్‌కి సహయపడడానికి ఎల్లప్పుడూ ముందుకి. వస్తూనే వచ్చారు. అట్టివారిలో బి.జి.మోడక్‌, డి, ఎ , కరేలు తమ కేసులలో... కొన్నింటిని ఈవికసిస్తున్న న్యాయవాదికి అప్పజెప్పారు, బాట్లే బాయ్‌. ఇన్హబ్యూట్‌ఆఫ్‌ అకాంటెన్సిలో పార్ట్ టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అంబేద్కర్‌. తన వృత్తి పరమైన ఆదాయనికి తోడు మరికొంత ఆర్జించసాగాడు. బొంబాయి… యూనివర్శిటీలో ఒక ఎగ్జుమినర్‌గా పనిచేసినందుకు కూడా ఇంకొంత ఆదాయం వచ్చింది.

వ్యక్తిగత సమస్యలు అంబేద్కర్‌ ప్రజాజీవితంలో చురుకుగా పాల్గొనేడానికి అవరోధం కాలేదు. ఆయన 1924 మార్చి 9న పరేల్‌లోని దామోదర్‌ పోల్‌లో దళిత వర్గాల దయనీయ స్థితిపై దృష్టిని కేం(ద్రీకరింపజేయడానికి ఒక పబ్లిక్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. సలమూలంగా దృగ్గోచరమైన పరిణామ మేమిటంటే 1924 జూలై20 న“ బహిష్క్ఫృత్‌ హిత్‌కారణీ సభా' ( దళిత్‌ సంక్షేమ సంఘం) ఆవిర్భావం. విశేషమేమిటంచే ఈ సంఘం మానేజింగ్‌ కమిటీకి సర్‌ చిమన్‌లాల్‌ సెటల్‌వాడ్‌ అధ్యక్షునిగానూ, అంబేద్కర్‌ చైర్మన్‌గానూ వ్యవహరించారు. ఈ కమిటీలో పి ఆర్‌. పరంజోసీ, కే యఫ్‌. నారిమన్‌, బి .జి. భేర్‌ వంటి ఉద్దండులు సభ్యులుగా ఉండేవారు. దళితవర్గాల విద్యాస్థాయిని, ఆర్ధికస్థితిని పెంచడం, వారు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిహరించడం ఈ సంస్థా ఏర్పరచుకున్న స్వల్పకాలిక లక్ష్యాలు, సెడెన్‌ల హాం కాలేజీలో ప్రిన్సిపాల్‌ పదవికి ఖాళీ "ఏర్పడింది. వాస్తవానికి ఈ పదవిని చేపట్టడానికి అంబేద్కర్‌కి అన్ని ఆర్హతలూ ఉన్నాయి. అప్పుడు ఆర్‌.పి. పరంజోపే విద్యాశాఖా మంత్రిగా ఉన్నారు. ఆయన తలచుకుంటే అంబేద్కర్‌ని నియమించగలిగి ఉండేవాడు. కాని ఆయన అలా చేయలేదు. అయితే ఎలిఫెన్‌ స్టోన్‌ కాలేజిలో 'ప్రొఫెసర్‌ పదవికీ కొల్హాపూర్‌ సంస్థానంలో మంత్రి పదవికీ అంబేద్కర్‌కి ఆహ్వానాలు వచ్చాయి. కాని (ప్రజాజీవితంలోనూ, సంఘసేవలోనూ స్వతంత్రంగా ఉండే ఉద్దేశంతో రెండిటినీ తిరస్కరంచాడాయన,...

1927 ఏ ప్రిల్* *““బహిష్కృత్‌ భారత్‌'” అనే పత్రికను (ప్రారంభించాడు. అంబేద్కర్‌. రామన్న రాజ్యాంగ సవరణల దృష్ట్యాదళిత్‌ వర్గాలు ఎదుర్కొంటున్న... 'సంకటాలను పరిహరించే ఉద్దేశంతోనూ, వారి ప్రయోజనాలను పరిరక్షించే 'సంకల్పంతోనూ ఈ పత్రికను స్థాపించాడు ఆయన. వారి జనాభా దామాషా ప్రకారం వారికి ప్రాతినిధ్యాన్ని సాధించడం ఈ పత్రిక ప్రాథమిక లక్ష్యం... దేవాలయ (ప్రవేశం, సామాజిక జలవనరుల అందుబాటు సామాజిక స్థలాలలో 'నిరాటంక ప్రవేశం వంటివి దళితులకు కల్పించడం ఆశించిన ఇతర సాంఘిక సంస్కరణలలో కొన్ని. వాస్తవానికి యస్‌.కె . బోలె ఈ సంఘ సంస్కరణ చర్యలను ఆటంక పరచే వారిని శిక్షించడానికి చట్టపరమైన అర్హత కల్పించడానికి బొంబాయి శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అస్పృశ్యులకు ప్రజాసంస్థలలో ప్రవేశం కల్పించాలన్న ఆంశంమీద (ప్రజలదృష్టిని బలీయంగా తీసుకురావడం కోసం అంబేద్కర్‌ కొలాబా జిల్లాలోని మహద్‌లో సత్యా గ్రహాన్ని ప్రారంభించాడు. అగ్రవర్ణాల తీవ్ర ప్రతిఘటనకు బెదరకుండా ఊరి చెరువులోని నీటిని వాడుకోవలసిందిగా ఆయన అస్పృశ్యులకు పిలుపునిచ్చాడు... అయితే అస్పృశ్యులు వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేయలేదు. దళితుల. నాయకుడిగా, పబ్లిక్ ఫైనాన్స్‌ నిపుణుడిగా అంబేద్కర్‌ 1926లో రాయల్‌ కమిషన్‌... ఆన్‌ కరెన్సీ అండ్‌ ఫైనాన్స ముందు సాక్ష్యం ఇచ్చారు. మరుసటి సంవత్సరంలో ఆయనను డాక్టర్ సోలంకితోపాటు బొంబాయి లెజిస్ట్రేటివ్‌ కొన్సిల్‌కి నామినేట్‌ చేయడం...

దలితుల స్థాయిని సర్వతోముఖంగా పెంచడానికి విద్య పరమసాధనమని భావించాడు అంబేద్కర్‌. విద్యాసముపార్ణన ముఖ్యంగా ఉన్నత విద్య ద్వారా సాంఘిక, ఆర్ధిక సమానత్వాన్ని సాధించవచ్చునని భావించాడు ఆయన. అట్టడుగు వర్గాలు విద్యావంతులు కావడమే కాకుండా, ఈ వర్గాల ప్రజలు విద్యాబోధనా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనడం అంతే అవసరమని భావించాడు. బోధనా విద్యలోని విషయాలు బోధకుల సిద్దాంతాలను, ఆశయాలను, విలువలను ప్రతిబింప చేస్తాయనేది ఆయన భావన. ముఖ్యంగా ఆయన (బ్రాహ్మణులు అధ్యాపక వృత్తిలో గుత్తాధిపత్యం కలిగివుండడాన్ని వ్యతిరేకించాడు. అంబేద్కర్‌ భారత పరిపాలనా వ్యవస్థను గ్రామస్థ్రాయినుంచే ఆధునీకరించాలన్న సంకల్పంతో 1874 నాటి బొంబాయి వారసత్వపదవుల చట్టంకు సవరణ తెచ్చి జమీందారీ వ్యవస్థకు చిహ్నమైన వారసత్వపదవుల రద్దుకు ప్రయత్నించాడు కాని సఫలీ కృతుడుకాలేదు.

1928లో అంబేద్కర్‌ బొంబాయిలోని గవర్నమెంట్‌ లాకాలేజీలో న్యాయశాస్త్ర , అధ్యాపకునిగా నియమితుడయ్యాడు. పైమన్‌ కమీషన్‌ను కాంగ్రేసు . 'బహిష్కరించినా, తన విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా ఆయన కమీషన్‌ ముందు సాక్ష్యం ఇయ్యడానికి సంకోచించలేదు. దళిత వర్గాలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటుచేయడం ద్వారా వారి ప్రయోజనాలను పరిరక్షించ. డానికి అవకాశం కల్పించగల వాదాన్ని కమిషన్‌ ముందు వినిపించడం తన బాధ్యతగా భావించాడాయన. 'సైమన్‌ కమిషన్‌ భారతదేశం ఎదుర్కొంటున్న రాజ్యాంగపరమైన సమస్యలను చర్చించడానికి లండన్‌లో రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయవలసిందిగా సిఫార్స్‌ చేసింది. ఈ మొదటి. రౌండ్‌టేబుల్‌ సమావేశం 1930 నవంబర్‌లో లండన్‌లో జరిగింది. వివిధ పార్టీల, ప్రయోజనకారుల ప్రతినిధులను ఈ సమావేశంలో పాల్గొనవలసినదిగా. ఆహ్వానించారు. అస్పృశ్యుల ప్రతినిధిగా అంబేద్కర్ ను ఆహ్వానించారు. కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. దేశవ్యాప్తంగా సమావేశంపట్ల వ్యతిరేకత ఎదురయింది. వాస్తవాలను గమనించి పరిస్ఠీతుల నుంచి లబద్ధిపాందాలేకాని. అవాస్తవికంగా ఆలోచించి అసంభవాలను ఆశించడం సబబు కాదని ఆయన అభి ప్రాయం.

1930-31 మధ్యకాలంలో భారత జాతీయ కాంగ్రేస్‌ చట్ట ఉల్లంఘన... ఉద్యమాన్ని, ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మాగాంధి నాయకత్వంలో నడిపింది. 1931 మేలో కాంగ్రెస్‌, ప్రభుత్వం... గాంధీ - ఇర్విన్‌ పిక్స్‌ క్రింద ఒక రాజీపథకాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం... క్రీంద 1931 ఆగష్టు. డిసెంబర్‌ల మధ్య లండన్‌లో జరిగే రెండవ రౌండ్‌. టేబుల్‌ సమావేశానికి హజరు కావడానికి కాంగ్రెస్‌ అంగీకరించింది. ఈ 'సమావేశంలోని ప్రధాన అంశం కుల వ్యవస్థ , అస్పృశ్యులకు వేరే నియోజక వరాలు ఇందులోని అంతర్ భాగం. కాంగ్రేస్‌ ప్రతినిధులుగా గాందిజీ, మాలవీయ, 'సరోజినినాయుడు వ్యవహరించారు. అస్పృశ్యుల ప్రయోజనాల పరిరక్షణకు... ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అన్న అంశం మీద అంబేద్కర్‌, గాంధీజి. 'తలబడ్డారు. గాంధీజి అస్పృశ్యులకు ప్రాతినిధ్యం వహించడాన్ని అంబేద్కర్‌… తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ కుల అంశం భిన్న వర్గాల మద్య పూడ్చలేని ఆగాధాలను ఎంతగా సృష్టించిందంటే కులాల ప్రాతినిధ్యం. విషయంలో ఈ సమావేశం ఏ విధమైన ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. తిరిగి వచ్చాక గాందీజీ తనతోపాటు కాంగ్రెస్‌, దాని నాయకులు (ప్రభుత్వ అణిచివేతకి గురి అయిన విషయం గుర్తించాడు. మూకుమ్మడి ఆరెస్టులు 'మొదలయ్యాయి.గాంధీజీ కూడ అరెస్టు అయ్యాడు. 1932 ఆగస్టులో అస్ప్పత్యులకు (ప్రత్యేక నియోజక వర్గాలు ఉండాలన్న వాదాన్ని అంగీకరిస్తూ.రామ్సే మక్‌డానాల్డ్ ప్రభుత్వం ఆధికారికంగా 'కమ్యూనల్‌ అవార్డు' ను ప్రకటించింది. ఇది హిందూ సంఘసమైక్యతకు విఘాతం కల్పిస్తుందన్న కారణంగా గాంధీజి దీనిని అతి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాక ఈ పధకాన్ని పరిహరించకపోతే ఆమరణ వీరాహారదీక్ష పూనుతానని ప్రకటించారు. దాని అమలుకు అంతటి పట్టుదలను కనబరిచాడు అంబేద్కర్‌. అయితే గాంధీజీ నిరాహారదీక్ష కారణంగా సప్రు , జయకర్‌ల జోక్యంతో ఆయన ఒక రాజీ పథకానికి అంగీకరించవలసి వచ్చింది. దీని (ప్రకారం కేవలం కుల ప్రాతిపదికపై నియోజక వర్గాలకు బదులు అస్పృశ్యులకు సీట్లలో రిజర్వేషన్‌లు కల్పిస్తూ ఉమ్మడి నియోజక వర్గాలు ఉంటాయి. పూనా ఒప్పందంగా ప్రసిద్రి గాంచిన ఈ ఒప్పందం 1932 సెప్టెంబరు 24 న కుదిరింది. రాజ్యాంగ సంస్కరణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటి సభ్యునిగా లండన్‌ లోని 1932-33 మూడవ రౌండ్‌టేబుల్‌సమావేశింలో సభ్యునిగా అంబేద్కర్‌ రాజ్యాంగ నిపుణుడిగా తన వ్యాసంగాన్ని కొనసాగించాడు.

1935 లో అంబేద్కర్‌ బొంబాయిలోని లా కాలేజీకి (ప్రిన్స్‌పాల్‌గా పెర్రీ. 'ప్రొఫెసర్‌ ఆఫ్‌ జ్యూరిస్‌ప్రూడెన్స్‌ గా నియమితుడయ్యారు. అయినప్పటికి ఆయన సామాజిక ప్రజాజీవనంలో ముఖ్యంగా ఆంటరానికులాల వారి విషయాలలో చురుకైన పాత్రను కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన 1935 అక్టోబరు 13న నాసిక్‌లోని యవోలాలో. జరిగిన రాష్రస్థాయి దళిత మహాసభకు అద్యక్షునిగా వ్యవహరించారు. తన... అద్యక్షోపన్యాసంలో ఆయన ప్రఖ్యాతి గాంచిన ఈ వాక్యాలను.. పేర్కొన్నారు. “నేను హిందూ మతంలొ పుట్టాను. కాని నేను హిందువుగా 'చావను.”” అని. ఈ సంద ర్బం లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో తొలి సంవత్సరాలలో ఉన్నప్పుడు హిందూ మతాన్ని వదలి క్రైస్తవ మతాన్ని కాని, ఇస్లామ్ మతాన్ని కాని స్వీకరించాలి అన్న భావన కలిగినప్పటికీ చివరికి 'హిందువుగానే ఉండాలని నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే అంబేద్కర్‌ బౌద్ద మతాన్ని పరిగ్రహించడం, హైందవాన్ని పరిత్యజించినట్లు కాదని గాంధీజీ భావించారు. ఎందుకంటే ఆయన దృష్టిలో బౌద్దం, జైనం రెండు కూడా హైందవ మత శాఖలే. యవోలా సమావేశానికి హాజరయిన వారిలో అత్యధికులు అంబేద్కర్‌ అభి ప్రాయానికి వత్తాసు పలికారు. అయితే అంబేద్కర్‌ హిందూ మతాన్ని వదిలాక తాను ఏ మతంలో జేరదలచుకున్నదీ చెప్పటానికి నిరాకరించారు. 1935 డిసెంబరులో లాహోరులోని జాత్‌-పాత్‌-తోడక్‌ మండల్‌, 1936 లో జరిపే తమ వార్షిక సమావేశానికి అద్యక్షస్తానం వహించవలసిందిగా ఆహ్వానించారు. అందుకోసం ఆయన “కులనిర్మూలనము'* అన్న (ప్రఖ్యాత అద్యక్షోపన్యాసాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. “అయితే సభ నిర్వాహకులు ఆయన తీవ్రభావాలకు భీతి చెందడంతో ఆ ఉపన్యాసం చదవకుండానే ఉండిపోయింది. 1936 మే లో ఆయన బొంబాయి రాజధాని మహర్‌ సమావేశంలో (ప్రసంగిస్తూ, హైందవ మతాన్ని విడిచిపెట్టవలసిన అగత్యం గురించి నొక్కి వక్కాణించారు.

1935 చట్టాన్ని అనుసరించి రాజధాని శాసన సభలకు ఎన్నికలు జరుపవలసిన అగత్యం ఏర్పడింది. అప్పటివరకూ అంబేద్కర్‌ శాసన సభలో నామినేటెడ్‌ సభ్యునిగా ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికలలో నిలబడి తాను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నిక కావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కార్మికవర్గంలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న దళితవర్గాల (ప్రజల ప్రయోజనాలను ఎన్నికలలో నిలబడి పోరాడి పరిరక్షించడం కోసం ఆయన “ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ 17 స్థానాలకు పోటీచేసి 15 స్థానాలను గెలచుకుంది. అయినప్పటికీ అధికారపార్టీ కాంగ్రెసే అయింది. అంబేద్కర్‌ బొంబాయి శాసన సభలో ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆయన పార్టీ సాధించిన విజయాలలో చెప్పుకోదగ్గది 1937 ఆగస్టులో ఖోటీబిల్లును ప్రవేశపెట్టి మహర్‌వతన్‌ బిల్లును రద్దు చేయడం, ఆ కాలంలో కొంకణ్‌ ప్రాంతంలో అమలులో వుండిన కౌలుదారీ వ్యవస్థను రూపుమాపడం ఈ బిల్‌ ఉద్దేశం. వ్యవసాయ రంగంలో పాతుకునివున్న ఇంచుమించు వెట్టి వ్యవస్త ఈ బిల్‌మూలంగా కూలిపోతుంది కనుక ఇది మౌలికమైన (ప్రతిపాదన. సభాకార్యక్రమాల ఎజెండాలో ఇట్టిచట్టం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే . దీనిని విప్లవాత్మకమైనదిగా అభివర్ణించడం కుదరదు. ఎందుకంటే దీని , పర్యవసానంగా హక్కులు కోల్పోయే ఖోటులకి నష్టపరిహారం చెల్లించే వెసులుబాటు ఇందులో ఉంది. దీనికి అనుబంధంగా అంబేద్కర్‌ ప్రవేశపెట్టిన . మరోచట్ట (ప్రతిపాదన మహర్‌వతన్‌దారీపద్దతి గురించినది. అయితే ఆ . సమయంలో (ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ప్రోత్సహించక పోవడంతో ఈ చట్టం, . నిరవధికంగా వాయిదాపడింది. శాసన సభావేదికమీద అంబేద్కర్‌ చేపట్టిన చర్యలలో గణనీయమైనది వేరొకటి ఉంది. అది అస్పృశ్యులకు గాంధీజీ . “:హరిజనులు'* అని పెట్టిన పేరును కాంగ్రెస్‌ చట్టపరమైనదిగా చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం, ఆయన ఉద్దేశప్రకారం ఈ నామకరణం పైపూత చర్యేకాని ఇందువల్ల అస్పృశ్యుల స్థితిగతులలో మంచి మార్పేమి రాదని వారికి ఒరగేదేమి లేదని.

1942 జులైలో భారతదేశాన్ని ఏలుతుండిన (బ్రిటిష్‌ ప్రభుత్వం గవర్నర్‌ జనరల్ కి చెందిన ఎక్సక్యూటివ్‌ కౌన్సిలొమెంబర్‌గా అంబేద్కర్‌ను నియమించి కార్మిక శాఖను అప్పగించింది. 1946 జులైవరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. అయితే ఆయన ఈ పదవిని స్వీకరించడాన్ని అప్పటి జాతీయ భావాలుగల వర్ణాలలో అత్యధికం, ద్రోహపుచర్యగా వ్యాఖ్యానించాయి. పైకి ఇది న్యాయమైన 'విమర్శగానే అనిపించవచ్చు. కాని దానిని పైపైననే పరికించకూడదు. అంబేద్కర్‌ రాజకీయాల సమగ్ర స్వరూపంలో ఒక భాగంగా దీనిని పరిగణించి పరి శీలించాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంబేద్కర్‌ రాజకీయ భావనల ప్రకారం జాతీయభావాలు, జాతి స్వాతంత్రం వంటి పెద్దపెద్ద మాటలు సామాజిక- ఆర్థిక సమానత్వం, స్వేచ్చ, న్యాయం అనేవి సుస్పష్టమైన రూపంలో లేనప్పుడు అర్ధరహితమవుతాయి. క్విట్‌ ఇండియా ఉద్యమంతో బ్రిటిష్‌ పాలకులతో చావో బ్రతుకో తేల్చు కోవాలని హోరాహోరీ పోరాడుతున్న కాంగ్రేసుకి మాత్రం అంబేద్కర్‌ చర్య విద్రోహపూర్వకంగానే ఆనిపించింది... అస్పృశ్యులు, అణగారిన వర్గాలవారు స్వయం శక్తితోనే సాంఘిక న్యాయం సాధించుకోవాలి అనీ, జాతీయవాదులు ఆగుపడని జాతిపేరిట వారి ప్రయోజ నాలను బలిపెట్తారనీ భావించిన అంబేద్కర్‌ 1946 సెప్టెంబర్లో ఇంగ్లండ్‌ వెళ్లారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పష్టమైన రాజ్యాంగపరమైన రక్షణలను ఈ వర్గాలకు కల్పించి తద్వారా వారి ప్రయోజనాలను పరిరక్షించే. అవసరాన్ని (బ్రిటిష్‌ ప్రభుత్వానికి నచ్చచెప్పడం ఆయన పర్యటనలోని అంతరార్దం . కాబినెట్‌ మిషన్‌ ఈ విషయంలో శ్రద్రగా ఆలోచించాలని ఆయన (పగాఢంగా ఆకాంక్షించాడు.

1946 లో కాన్స్టిట్యూయెంట్ ఆసెంబ్లీలకి ఎన్నికలు జరుపతల పెట్టడంవల్ల ఉత్పన్నమైన తక్షణ అంశాలమూలంగా చాలా బిజీగా ఉండినప్పటికీ విద్యావిషయకమైన తనమేధావి జీవితాన్ని దెబ్బతిననీయలేదు అంబేద్కర్‌. . రాజకీయ కార్యకలాపాలు చురుకుగా నడుస్తున్న ఈ కాలంలోనే ఆయన తన ఆమితపాండితీ ప్రకర్షగల గ్రంథాలలో ఒకటైన ' 'శూద్రులు ఎవరు?" అన్న పుస్తకాన్ని (ప్రచురించారు. ఈ గ్రంథాన్ని ఆయన సమయోచితంగా మహాత్మాజోతిబాపూలెకి అంకితం చేశాడు. ఆయనని , అంబేద్కర్‌ హిందువులలో నిమ్నవర్గాలు ఆ గ్రవర్ణాలదగ్గర చేస్తున్న బానిసత్వాన్ని . గుర్తించేటట్టు చేసిన, భారతదేశానికి విదేశీపాలననుంచి విముక్తికంటే సాంఘిక . (ప్రజాస్వామ్యం ఎక్కువ అవసరం అన్న సూక్తిని ప్రబోధించిన, ఆధునిక , 'భారతపు అత్యున్నత శూద్రునిగా అభి వర్ణించాడు, ఈ గ్రంధాన్ని అంబేద్కర్‌ సిద్దాంతాల, ఆచరణల సారాంశం అని చెప్పవచ్చు. ఇందులో ఆయన ఒక నవచారిత్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం ఆదిలో త్రివర్ణ వ్యవస్త ఉండేదనీ, అందులోని క్షత్రియ వ్యవస్తలో శూద్రులు అంతర్భాగంగా . ఉండేవారని, బ్రాహ్మణులతో కలిగిన సంఘర్షణలలో జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) ధరించగల హక్కును వారు కోల్పోయారనీ తత్ఫలితంగా వారు నాలుగవ వర్ణంగా వైశ్యుల దిగువన వర్గీకరణం చెందారు అని,

1946 నవంబర్‌లో అంబేద్కర్‌ తన సొంతరాష్ట్రం మహారాష్ట్ర నుండి కాక బెంగాల్‌ నుంచి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంబేద్కర్‌ను జాతి వ్యతిరేకునిగా చిత్రించేవారికి, అసెంబ్లీలో తనతొలి ప్రసంగంలో ఆయన ఒక జాలిగా భారతదేశ సమైక్యతను గురించి ఉద్దాటించిన వాస్తవం, సమైక్య భారతదేశం గురించి బలీయంగా వాదించిన వైనం కనువిప్పు కాగలవు. 1947 ఆగష్టులో కాన్స్టిట్యూయెంట్ ఆసెంబ్లీ ఆయనను తన (డ్రాప్టింగ్‌ కమిటీ సభ్యునిగా నామినేట్‌ చేసింది. ఈ కమిటీ అంబేద్కర్‌ను తన అధ్యక్షునిగా ఎన్నుకుని విజ్ఞతను ప్రదర్శించింది. ఇది రాజ్యాంగముసాయిదాను అసెంబ్లీకి తయారుచేసి ఇయ్యడం, అవసరమైన అంశాలకు వివరణలు ఇచ్చి సమర్థించడం వంటి క్లిష్టకార్యాలతో నిబిడీకృతమైనట్టేది. దీనిని ఆయన సమర్ధవంతంగా నిర్వహించడంతో "భారత రాజ్యాంగ శిల్పి” (Architect of the Indian Constitution) అని సర్వేసర్వత్ర ప్రశంసలు లభించాయి. తానెన్నడూ అందులో స్వేచ్ఛగా తిరుగాడనప్పటికీ ఇది ఆయన కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థ ప్రధాన ధారలో సంలీనం కావడానికి తొలిమెట్టు అయింది బాబాసాహెబ్ అభిమానులలో చాలామందికూడా, ప్రభుత్వం ఆయనను నామినేట్ చేయదలుచుకున్నపుడు అందుకు ఆయన ఆమోదించిన తీరుకి విస్మయం చెందుతుంటారు. కాని విమర్శకులు రెండు ముఖ్య విషయాలను మరిచిపోతున్నారని చెప్పకతప్పదు కొత్తగా అధికారం చేపట్టిన యంత్రాంగం తోటి ఏదో విధమైన కార్యవాహక సంబంధం నెలకొల్సుకోనిదే, తాను జాతీయ జీవనంలో ఒంటరివాడై పోతాడన్న వాస్తవాన్ని అంబేద్కర్ సరిగా గ్రహించడం మొదటిది. ఆ యంత్రాంగంలో తానూ భాగస్వామి అయినప్పటికీ, దానిని విమర్శించే హక్కును వదులుకొనకపోవడం రెండవది. వాస్తవానికి అది ఆయనకి బాధాకరమైన విషయమే అందుకే పర్యవసానంగా అధికార మందిరం నుండి ఆయన నిర్గమనాన్ని ముందుగానే ప్రవచించడం సాధ్యం అయింది. బహుశా లౌకిక భావాలు, మానవత్వం, శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తి, అభ్యుదయ భావాలు గల జాతీయ నాయకునిగా నెహ్రూ ఆయనకు ఆమోదయోగ్యుడై ఉండవచ్చు. అందుచేత 1947 ఆగస్టు 15న ఆయన నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖను నిర్వహించే కాబినెట్ మంత్రిగా జేరడానికి ఇష్టపడ్డాడు. అయితే త్వరలోనే ఆయనకు నెహ్రూ ప్రభుత్వం పట్ల నిరాశకలిగి పూర్తిగా భ్రమలు తొలగిపోవడంతో 1951 సెప్టెంబర్ రాజీనామా చేశారు ఆయన తాను రాజీనామా చేయడానికి మామూలుగా చెప్పే కారణం, తాను ప్రవేశపెట్టిన హిందూకోడ్ బిల్లుపట్ల ప్రభుత్వ విధానం అయినా, నిజానికి షెడ్యూల్డ్ కులాలపట్లు ప్రభుత్వధోరణి, ప్రభుత్వ విదేశీవిధానం ఆయనకు నచ్చకపోవడం ముఖ్యమైన కారణాలు 1952 మార్చిలో అంబేద్కర్ రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 1952 జూన్ తాను గతంలో విద్యనభ్యసించిన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనను యల్ యల్ డి ఆనోరిస్ కౌసా (L.L.D. Honoris Causa) డిగ్రీ ఇచ్చి సత్కరించింది. 'భారతదేశపు రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పట్టా ప్రధానం చేయబడుతున్నది. '' అని సైటేషన్లో పేర్కొన్నారు. కొలంబియా విశ్వ విద్యాలయం '' భారత ప్రముఖులలో ఒకరు, గొప్ప సంఘసంస్కర్త మానవ హక్కుల పరిరక్షణ యోధుడు'' అని ఆయనను ఘనంగా కీర్తించింది. ఆయనతో పాటు సత్కారం పొందినవారిలో కెనడా దేశపు విదేశాంగ కార్యదర్శి లెస్టర్.బి. పియర్సన్ (Lester B. Pearson), ప్రఖ్యాత ఫ్రెంచ్ చరిత్రకారుడు డేనియల్ మానెట్ (Daniel Monnet), మరి ఎనిమిదిమంది ప్రతిభావంతులైన అమెరికన్లు ఉన్నారు వీరందరికీ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది కొలంబియా యూనివర్శిటీ.

బౌద్ధమతాన్ని స్వీకరించాలన్న ఆకాంక్ష అంబేద్కర్ అంతరంగంలో చిరకాలంగా పెరుగుతోంది. అనేక బౌద్ధసభలలో పాల్గొనసాగాడు. 1949 లో ఖాట్మాండూ (నేపాల్) లో జరిగిన ప్రపంచ బౌద్ధమహాసభలో ఆయన పాల్గొన్నాడు. అందులో ఆయన బుద్ధిజం, మార్క్సిజంలను తులనాత్మకంగా పోలుస్తూ, మార్క్సిజంకంటె బుద్ధిజంయే మిన్న అని నిరూపిస్తూ ఆలోచనలను రేకెత్తించే గొప్ప ప్రసంగాన్ని చేశారు. తర్వాత 1950లో జరిగిన ప్రపంచ బౌద్ధమహాసభలో కూడా ఆయన పాల్గొన్నారు. 1951 జులైలో భారతీయ బుద్ద జనసంఘ్ అనే సంస్థను స్థాపించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ '' బుద్ధ ఉపాసనా పంథ'' అనే బౌద్ధ ప్రార్థనా గ్రంధాన్ని ప్రచురించాడు. 1954 లో రంగూన్ లో జరిగిన ప్రపంచ బౌద్ధ సభలకు ప్రతినిధిగా ఆయన వెళ్ళాడు. 1955 మేలో ఆయన 'భారతీయ బుద్ధ మహాసభ' ను స్థాపించాడు. 1956 అక్టోబర్ 14 వ తారీఖున నాగపూర్ లో ఆయన శాస్త్ర బద్ధంగా హిందూమతాన్ని పరిత్యజించి, బౌద్ధమతాన్ని పరిగ్రహించారు. 1956 నవంబర్ ఖాట్మండలో జరిగిన ప్రపంచ బౌద్ధమహాసభకు ఆయన ఒక ప్రతినిధి గా వెళ్ళాడు. అక్కడ ఆయనను 'నవబుద్ధ'' అని కీర్తించారు. అంబేద్కర్ జీవితంలోని చరమ సంవత్సరాలేమీ సంతోషదాయకాలు కావు. ఆయనను రెండు దురద్రుష్టాలు - క్షీణిస్తున్న ఆరోగ్యం, తానునడుపుతున్న సంస్థల నిర్వహణను దెబ్బ తీస్తున్న ఆర్థికలేమి అనేవి వెంటాడ జొచ్చాయి. 1955 మే నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించసాగింది. అంతకు ముందు ఆయన తన దంతాలను తీయించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇంట్లో కూడా ఇతరుల సహాయం లేనిదే బొత్తిగా తిరుగాడలేనంతగా బలహీనపడ్డాడు. ఆయన శ్వాసకూడా భారమయింది. ఆక్సిజన్ సిలిండర్ను ఇంట్లో అందుబాటులో వుంచి అప్పుడప్పుడు వాడుతుండేవారు. ఈ విషయం తెలిస్తే తన అనుయాయులు భీతిల్లుతారన్న భయంతో ఆయన తన అనారోగ్యం గురించిన వాస్తవాలను బయటకు పొక్క నీయలేదు. కొద్దిరోజులలోనే ఆయనకు వారానికి రెండు సార్లు ఆక్సిజన్ సిలిండర్ పెట్టవలసిన అవసరం ఏర్పడింది. చలికాలంలో ఉష్టాన్నీ, వెచ్చదనాన్నీ కృత్రిమంగా కల్పించవలసి వచ్చింది. అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ ఆయన భార్యకీ, ఆయన వైద్యుడు డాక్టర్ మవ్ లన్ కర్కీ మాత్రమే తెలుసు. ఆయన వద్దంటున్నా, వైద్య సలహా ననుసరించి చలికాలంలో బ్రాందీ, వేసవిలో బీర్ కొన్ని డోసులు ఇయ్యాల్సి వచ్చింది. ఆహారం తినడం కూడా కష్టమయింది. త్వరత్వరగా బరువుకోల్పోసాగాడు. ఆయన ఎంతగా సన్నబడి పోయాడంటే ఆయన సూట్స్ కి సైజులు మార్పించవలసి వచ్చింది. వీటికితోడు ఆయనకు దుఃఖం కలిగించిన అంశాలు కూడా మరికొన్ని ఉన్నాయి. ఆయన గత సహచరులు, విధేయులుగా ఉండిన అనుయాయులు, ఆఖరికి తనపట్ల ఎంతో విధేయత చూపిన సెక్రటరీ చిత్రేతో సహా ఎందరో ఆయనను వదలి వెళ్ళిపోయారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ఆర్థిక సంక్షోభపు ఊబిలో కూరుకునిపోయాయి. తన సంస్థను నిలబెట్టడానికి ఆయన నెహ్రూ సహాయాన్ని కూడా ఆర్జించాడు. అమెరికానుంచి విరాళాలు సేకరించడానికి ప్రయత్నించాడు. కాని ఇవేవీ ముఖ్యంగా అమెరికాలో విరాళాలు సేకరించడానికి ప్రయత్నించాడు. కాని ఇవేవీ ముఖ్యంగా అమెరికాలో విరాళాలు సేకరించే ప్రయత్నాలు ఫలించలేదు. 1955 ఆగస్టులో ఆయన పూనిక మీద షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ పార్లమెంట్లోనూ, రాష్ట్ర శాసనసభలలోనూ, జిల్లా లోకల్ బోర్డలోనూ, వాటి అవసరం తీరిపోయింది కనుక షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం తీరిందనీ, వాటిని రద్దు చేయవలసిందనీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే సంఘసంస్కర్త అయిన ఆయన రాజ్యాంగానికి తరచు సవరణలు చేయడాన్ని అంగీకరించలేదు. అలా చేయడంవల్ల రాజ్యాంగ మౌలిక పద్ధతి ఆస్థిరత్వానికి గురి అవుతుందని ఇమిడివున్న సరళమైన ప్రజాస్వామ్యం కావచ్చు. 1956 లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించేముందు ఆయన బౌద్ధ సిద్ధాంతాలకు తన వ్యాఖ్యా నాలను చెప్తూ, అది కమ్యూనిజం, మార్క్సిజంలకు ఉత్తమ సమాధానంగా నిరూపిస్తూ ప్రసంగాలు చేసేవాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆయన బౌద్ధమతాన్ని గాంధేయ సిద్ధాంతాలపైన ప్రచారంచేశాడు. రక్తరహిత, అహింసాయుత విప్లవం ద్వారా మార్క్సిజం లక్ష్యాలను బౌద్ధం తీసుకు రాగలదని ఆయన ప్రబోధించాడు. నిజానికి ఆయన 'బౌద్ధ కమ్యూనిజం'' (Buddhist Communism) అనే పదాన్ని కూడా వాడాడు. ఒక ప్రక్కన ఆరోగ్యం క్షీణిస్తున్నా అంబేద్కర్ '' దిబుద్ద అండ్ హిజ్ ధర్మ '' (The Buddha and His Dharma) అనే ఉద్ధగ్రాంథాన్ని రచించి ప్రచురించాడు. సుక్షేత్రమైన ఆయన మస్తిషం అటువంటి మేధోత్పత్తిని పారిస్తున్నా మరో ప్రక్కన భారత ప్రజాస్వామ్యాన్ని బలపరచే పధకాలకు నమూనాలను రూపొందిస్తూనే వచ్చింది. భారతదేశ రాజకీయ ప్రజా స్వామ్యాన్ని పునర్విర్య పరిచేందుకు ఆయన 'రిపబ్లికన్ పార్టీ'' అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి ప్రతిపాదనలు చేశాడు. రాజకీయ జీవితం గైకొనాలకునేవారికి శిక్షణ సంస్థను కూడా స్థాపించాలన్న వినూత్నమైన ఆలోచన ఆయనకి వచ్చింది. అయితే నిత్యమూ ఆయన శరీరం కృంగిపోతూనే ఉంది. డిసెంబర్ 6వ తారీఖు వేకువఝామున 6.30 ప్రాంతంలో ఆయన భార్య సవితా అంబేద్కర్ ఆయనను నిద్రలేపడానికి పడక దగ్గరకు వచ్చింది. అయితే ఆమె తన భర్త నిద్రలోనే కన్నుమూశాడన్న కఠిన వాస్తవంతో రాజీపడవలసి వచ్చింది.

ఆ విధంగా ఒక గొప్ప జీవితం ముగిసింది. ఆయన మృతితో ఆ శకం మొత్తం ముగిసింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి చారిత్రక పురుషులు మరణానంతరం కూడా జీవిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు ప్రతిభావంతమైన వారి ఆలోచనల ద్వారా, వారు జీవించిన కాలంలో జాతి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక జీవనాలపై వేసిన ముద్రలద్వారా మరింత చురుకుగా జీవిస్తారు. ఆయనను సరిగా అధ్యయనంచేసి, ఆయన జీవితంలోని, ఆలోచనలలోని సారాన్ని, సారాంశాన్నీ గ్రహించీ ఆయన గొప్ప దృష్టిని పునర్ గ్రహించీ, ఆయన మార్గదర్శకత్వం వహించిన ఘనమైన మార్గంలో అగ్రగామిగా పయనించీ ఆయనకు సజీవ వ్యక్తులు నివాళులు ఘనంగా అర్పించడంకంటే చేయగలిగింది వేరేమి ఉంది? ఒక బౌద్దునిగా ఆత్మయొక్క అస్థిత్వాన్ని కాని పునర్జన్మను కాని విశ్వసించలేదు. అయితే ఆయన బౌద్ధం, ఆయన జీవితం, చారిత్రాత్మక కృషి మరణానంతరం కూడా చారిత్రక శక్తులుగా జీవించడాన్ని అవరోధించదు. ఆయనను అర్థంచేసుకోవడమంటే మారుతున్న ప్రపంచాన్ని సృజనాత్మకమైన ఆయన భావాలతో పటిష్ఠపరచడమన్న మాట. ఆయనను యాంత్రికంగా అనుసరించడం లేదా చైతన్యవంతమైన ఆయన ఆలోచనలను నిస్తేజం చేయడంకంటె ఆయన స్మృతికి మనం చేసే అపసేవ మరోటి ఉండదు. ఆయన జీవితాన్ని, ఆలోచనలను ప్రేరణ కల్పించే ఉత్పత్తిస్థానాలుగానూ, వనరులుగానూ భావించడంకంటె ఆయన ఇష్టపడే నివాళి వేరే ఉండదు.

Responsive Footer with Logo and Social Media