భూతం - వడ్డిగింజ
రామాపురం అనే ఊరిలో రాము సోము అని ఇద్దరన్నదమ్ములు ఉన్నారు. రాము సోము ఇద్దరు కవలపిల్లలు. రాము తెలివైనవాడు, ధైర్యవంతుడు ఇక సోము విషయానికి వస్తే సోము అమాయకుడు, భయస్తుడు. ఒక రోజు రాము సోము వాళ్ళ స్నేహితులతో ఉరికి దగ్గరలో ఉన్న అడివిలో ఆడుకుంటుంటే వారికీ ఒక్కసారిగా ఎదో భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి పిల్లలందరూ తలోదిక్కు పరుగందుకున్నారు. రాము కూడా వెళ్ళిపోయుంటాడని సోము కూడా ఇంటికి వచ్చేశాడు.
కానీ రాము అక్కడ అడివిలోనే దారితపి నెమ్మదిగా ఊరివైపు నడుచుకుంటూ వస్తుంటాడు. దారిలో రాముకి ఒక పెద్ద మఱిచెట్టు కనిపిస్తుంది. ఆ మట్టిచెట్టు దాటుకొని రాము ఊరిలోకి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టులో ఒక భూతం చాలా కాలంగా నివసిస్తుండేది అలాగే తాను దొంగతనం చేసి సేకరించిన చాలా మంత్రాల పుస్తకాలూ కూడా ఆ చెట్టుతొర్రలో దాచిపెడుతుండేది.
రాము ఆ మర్రిచెట్టుని దాటుకుని వెళ్ళేసమయానికి భూతం అతని ముందు ప్రత్యక్షమౌతుంది. ఆ భూతం రాముతో "ఎవరు నువ్వు? ఎక్కడ ఎం చేస్తున్నావ్?" అని అడుగుతుంది. అప్పుడు రాము తన పేరు రాము అని తాను ఆడుకుంటూ దారితపిపోయానని భూతంతో చెప్తాడు. అప్పుడు భూతానికి ఒక ఆలోచన వస్తుంది నేనా అని వేళలా నా దగ్గర ఉండే పుస్తకాలను కాపలాకాయలేను. ఎవరినైనా ఈ పుస్తకాలకి కాపలా పెట్టాలి అని అనుకుంటుంది కానీ కాపలా ఉండేవాడికి చదువు వచ్చి ఉండకూడదు అని నిర్ణయించుకుంటుంది." భూతం రాముతో నీకు చదువు వచ్చా అని అడుగుతుంది. దానికి రాము " ఓ బాగా వచ్చు" అని సమాధానం ఇస్తాడు. అయితే నీతో నాకు పనిలేదు నేను నిన్ను ఇక్కడే చంపేస్తా అని అంటుంది. రాము ఒక క్షణం అలోచించి. భూతం గారు మీకు చదువురాని వాళ్ళు కావాలా అని అడుగుతాడు. దానికి భూతం అవును నాకు చదువురానివాడు కావాలి పనిలోకి అని చెప్తుంది.
అలా ఐతే నా తమ్ముడు సోము ఉన్నాడు. వాడికి అసలు చదువురాదు. మీరు ఒప్పుకుంటే నేను వెళ్లి వాడిని పంపిస్తాను అంటాడు రాము. "నీ తమ్ముడిని నేను ఎలా గుర్తుపట్టాలి?" అని అడుగుతుంది భూతం. అప్పుడు రాము తాను మరియు సోము ఇద్దరు కావలపిల్లలమని చెప్తాడు. సరే నువ్వు వెళ్లి మీ తమ్ముడిని పంపించు. ఒకవేళ నా దగ్గరకి మీ తమ్ముడు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తాను అని అంటుంది భూతం రాము చకచకా ఇంటికి వచ్చి తన తమ్ముడు సోము లాగా రెడీ అయి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి "భూతం గారు ! భూతం గారు! " అని పిలుస్తాడు.
భూతం చెట్టుతొర్రలో నుండి బయటకి వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నా పేరు సోము అండి మా అన్నయ్య ఎక్కడ ఎవరో భూతం నాకు పని ఇస్తానన్నారు అని చెప్పాడు అందుకే వచ్చాను అని కొంచెం భయం నటిస్తూ చెప్తాడు. సరే మరి నీకు చదవడం రాయడం వచ్చా అని అడుగుతుంది భూతం. దానికి రాము నాకు చదువు అబ్బలేదు అంది అందుకే మీ దగ్గర పని కోసం వచ్చాను అని అంటాడు.
భూతం రాముని చెట్టుతొర్రలోకి తీసుకువెళ్లి అక్కడ ఉన్న పుస్తకాలను చూపించి " ఈ రోజు నుండి నువ్వు ఈ పుస్తకాలని కాపలాకాస్తుండాలి. అలాగే నేను అడిగిన పుస్తకాలూ నాకు ఇస్తూ ఉండాలి" ఇదే నీ పని అని చెప్తుంది భూతం. రాము కూడా సరే అని అంటాడు. రాము తన పని మొదలు పెట్టి, ప్రతి రోజు భూతం అడిగిన పుస్తకాలను కాపలా కాస్తూ, సరిగా అందిస్తూ ఉండేవాడు. కానీ, భూతానికి తెలియకుండా రాము ఆ పుస్తకాలను చదవడం కూడా మొదలు పెట్టాడు. రాము ఆ పుస్తకాలను చదవడం ద్వారా అనేక రహస్యాలు మరియు మంత్రాలను తెలుసుకున్నాడు. ఒక రోజు రాము పుస్తకం చదువుతున్నప్పుడు భూతం అతన్ని చూసింది. భూతం రాముని వెంబడిస్తు వచ్చింది. రాము, భూతం వస్తుందని గ్రహించి, ఒక మంత్రం చదివి కుందేలుగా మారిపోయి భూతానికి దొరకకుండా పరిగెత్తడం మొదలు పెట్టాడు. భూతం కూడా ఒక మంత్రం చదివి నక్కగా మారి రాముని వెంబడించింది..
రాము, భూతం నుండి తప్పించుకోవడానికి వెంటనే మరొక మంత్రం చదివి పావురంగా మారి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. భూతం వెంటనే మరొక మంత్రం చదివి గ్రద్దలాగా మారి రామును రామును వెంబడించింది. ఇలా రాము మంత్రాలను చదివి వివిధ జంతువులుగా మారుతుండగా, భూతం కూడా తన మంత్రాలతో రూపం మారుతు రామును వెంబడిస్తుంది. చివరికి, రాము ఒక మంత్రం చదివి ఒక గులకరాయిగా మారి నెలా మీదా పడతాడు. భూతం కూడా తన మంత్రం ద్వారా వడ్డిగింజగా మారిపోయి గులకరాయి పక్కన పడుతుంది.
ఆ మరుక్షణమే రాము మరొక మంత్రం చదివి కోడిపుంజుగా మారి ఆ వడ్డిగింజాని తినేసాడు. దానితో భూతాన్ని పూర్తిగా అంతం చేశాడు రాము . రాము ఆ తరువాత తిరిగి మానవ రూపంలోకి వచ్చి, ఊరికి తిరిగి వెళ్లాడు. తన తమ్ముడు సోముతో కలిసి సంతోషంగా జీవించాడు. ఈ సంఘటన తరువాత, రాము, సోము మరియు వారి స్నేహితులు మరలా అడవిలో ఆడే ధైర్యం చేయలేదు.